ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:25 PM
ఇరాన్‌పై దాడులు చేయడంలో అమెరికా-ఇజ్రాయెల్‌కు సహకరించిన ఐదు అరబ్ దేశాలు తమకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ రాయబారి, శాశ్వత ప్రతినిధి అమీర్-సయీద్ ఇరావానీ తాజాగా ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.
తమపై దాడులు చేయడంలో అమెరికా-ఇజ్రాయెల్‌కు సహకరించిన ఐదు అరబ్ దేశాలు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ రాయబారి, శాశ్వత ప్రతినిధి అమీర్-సయీద్ ఇరావానీ తాజాగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడు జమాల్ ఫరేస్ అల్-రోవాయిలకు లేఖలు రాశారు (Iran compensation demand Arab nations).
అమెరికా-ఇజ్రాయెల్‌కు సహకరించిన బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, జోర్డాన్‌ల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి సయీద్ ఇరావానీ విజ్ఞప్తి చేశారు. కొన్ని గల్ఫ్ దేశాలు అమెరికాకు సహాయం చేశాయని, తమ భూభాగం, గగనతలం ఉపయోగించుకునే అవకాశం ఇచ్చినట్లు ఇరాన్ ఆరోపించింది. ఆ అరబ్ దేశాల వల్లే ఇరాన్‌పై దాడులు జరగడానికి వీలైందని, ఈ కారణంగా ఆ దేశాలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ అభిప్రాయపడింది (US Israel Iran aggression).
ఈ డిమాండ్‌తో గల్ఫ్ దేశాలు, ఇరాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కనబడుతోంది (Gulf states role Iran war). ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి మరింత సంక్లిష్టం అవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తమ ఆరోపణలను ఇరాన్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిరూపించాల్సి ఉంటుంది. యుద్ధంలో ఆయా దేశాల ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్రను సాక్ష్యాలతో సహా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ డిమాండ్ అమలు కావడం దాదాపు అసాధ్యం.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు?