అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:54 PM
దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరిగాయి. 21 గంటల పాటు జరిగిన ఆ చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలక అంశంగా మారింది.
దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. 21 గంటల పాటు జరిగిన ఆ చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలక అంశంగా మారింది. అమెరికా తీసుకొచ్చిన ఒక ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడంతో అడుగులు ముందుకు పడలేదు (Tehran rejects US proposal).
అగ్రరాజ్య మీడియా కథనాల ప్రకారం.. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించింది. అందుకు ఇరాన్ నిరాకరించింది. అంత ఎక్కువ కాలం తమ అణు కార్యక్రమాన్ని ఆపడం సాధ్యం కాదని, 5 సంవత్సరాల వరకు నిలిపివేయడానికి అంగీకరిస్తామని టెహ్రాన్ చెప్పినట్టు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. నిజానికి ఇరాన్ శాశ్వతంగా యురేనియం శుద్దిని ఆపాలని అమెరికా ఎప్నట్నుంచో కోరుతోంది. చర్చల సందర్భంగా 20 ఏళ్ల కాలానికి దిగి వచ్చింది. అయితే ఇరాన్ ఆ 20 ఏళ్ల కాలానికి కూడా అంగీకరించలేదు (US Iran nuclear deal 2026).
అణు కార్యక్రమం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే శాంతి చర్చలకు బ్రేక్ పడినట్టు అమెరికా మీడియా పేర్కొంది (US Iran negotiations collapse). ఇస్లామాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్లో జరిగిన ఈ భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ సహా ఇరు దేశాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, సమావేశం జరిగిన గదిలోకి వీరెవరూ ఫోన్లను తీసుకెళ్లలేదు. దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ సమావేశం సత్ఫలితాలను ఇవ్వలేదు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు?