Share News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు..10 మంది మృతి

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:12 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాలో వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. బాయిలర్ పేలడంతో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు..10 మంది మృతి
Chhattisgarh Boiler Explosion

ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సక్తి జిల్లాలోని వేదాంత పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలడంతో 10 మంది కార్మికులు మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు.


ఈ ఘటన బాయిలర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటన సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటి అనే దానిపై పరిశీలన కొనసాగుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం మరోసారి పారిశ్రామిక భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భారీ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read:

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు గుడ్‌బై.. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధించిన పీసీబీ

For More Latest News

Updated Date - Apr 14 , 2026 | 07:48 PM