Share News

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:21 PM

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం
Delimitation Bill

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండింటి గురించి పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఎంపీలకు సమాచారమిస్తూ.. సంబంధిత ప్రతులను వారికి పంపింది. నూతన బిల్లు ప్రతిపాదనల ప్రకారం.. రాష్ట్రాల్లో 815 వరకు లోక్‌సభ స్థానాలు పెరగనుండగా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలకు పెరిగే అవకాశముంది. దీంతో మొత్తం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి చేరొచ్చని సమాచారం. లోక్‌సభలో దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందాక కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి, సీట్ల పెంపు ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలుచేసే దిశగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

బిహార్ నూతన సీఎంగా సమ్రాట్ చౌధరీ..

కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్

Updated Date - Apr 14 , 2026 | 05:21 PM