Home » Lebanon
లెబనాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇజ్రాయెల్ గత ఏడాది కాలంగా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ సైన్యం శనివారం కూడా లెబనాన్‌పై దాడి చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్‌కు తొలిసారి భారీ షాక్ తగిలింది. లెబనాన్ నుంచి పలు రాకెట్లు ఇజ్రాయెల్ భూభూభాగంలోకి దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో జరిగిన ఈ దాడి ఏడుగురు చనిపోయారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.
‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!
లెబనాన్ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.
ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య దాడులతో సతమతమవుతోన్న లెబనాన్ ప్రజలకు భారత్ మానవతా సాయం అందించింది.
సంక్షుభిత పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున ఔషధాలను భారత్ పంపుతోంది. ఇందులో భాగంగా 33 టన్నుల మానవతా సరఫరాలను పంపుతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!
సెంట్రల్ గాజా డెయిల్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు.