Share News

లెబనాన్‌లో కాల్పుల విరమణ సంబరాలు.. సొంత గూటికి చేరుతున్న ప్రజలు

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:50 PM

సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో లెబనాన్ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే సరిహద్దు ప్రాంతాల ప్రజలు, నిర్వాసితులు తమ నివాసాలకు పయనమయ్యారు.

లెబనాన్‌లో కాల్పుల విరమణ సంబరాలు.. సొంత గూటికి చేరుతున్న ప్రజలు
Lebanon Celebrates 10-Day Ceasefire with Israel

లెబనాన్, ఏప్రిల్ 17: చాలా కాలంపాటు సాగిన ఉద్రిక్తతల తర్వాత లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో లెబనాన్ దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే సరిహద్దు ప్రాంతాల ప్రజలు, నిర్వాసితులు తమ నివాసాలకు పయనమయ్యారు.


బీరుట్ ఆకాశం బాణసంచా, గాలిలోకి జరిపిన కాల్పుల (tracer fire) కాంతులతో నిండిపోయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి కాల్పుల విరమణను సంబరంగా జరుపుకున్నారు. సిడాన్ (Sidon) వంటి ప్రాంతాల్లో వేలాది మంది నిర్వాసితులు తమ సామగ్రిని వాహనాలపై సర్దుకుని తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.


సంబరాల్లో భాగంగా కొందరు మహిళలు ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ప్రస్తుత సుప్రీం మోజ్తబా ఖమేనీ ఫోటోలతో ఉన్న జెండాలను ప్రదర్శించడం కనిపించింది.

lebanon-2.jpg


దక్షిణ లెబనాన్ వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 10 రోజుల ఈ స్వల్పకాలిక ఒప్పందం శాశ్వత శాంతికి దారితీస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ, యుద్ధం ఆగిందన్న సంతోషంతో ప్రజలు తిరిగి సొంత ఊళ్లకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

lebanon-3.jpg


కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన వెంటనే, బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల (Dahieh) నుంచి హెజ్‌బొల్లా సభ్యులు తమ రహస్య స్థావరాల నుంచి బయటకు వచ్చి గాలిలోకి కాల్పులు జరపడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Updated Date - Apr 17 , 2026 | 04:49 PM