Share News

వెంటనే ఇళ్లు ఖాళీ చేయండి.. దక్షిణ లెబనాన్ వాసులకు ఇజ్రాయెల్ వార్నింగ్..

ABN , Publish Date - May 03 , 2026 | 11:18 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడేలా కనబడడం లేదు. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పక్షాలూ దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

వెంటనే ఇళ్లు ఖాళీ చేయండి.. దక్షిణ లెబనాన్ వాసులకు ఇజ్రాయెల్ వార్నింగ్..
Israel Lebanon evacuation

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడేలా కనబడడం లేదు. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పక్షాలూ దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా దక్షిణ లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఓ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత త్వరగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని సూచించింది (Israel Lebanon evacuation).


దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో తీవ్ర వైమానిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక పౌరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాకెట్లు, డ్రోన్లతో హెజ్‌బొల్లా దాడులు చేస్తుండగా, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ముందుకు సాగుతోంది. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఇప్పటికే పలుచోట్ల భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి (southern Lebanon warning).


ఇజ్రాయెల్ దాడుల కారణంగా దక్షిణ లెబనాన్ వాసుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి (Hezbollah Israel conflict). ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దాడులు జరుగుతున్న ప్రాంతానికి కిలోమీటర్ అవతలకు వెళ్లాలని సూచించింది. ఆదివారం తెల్లవారుజామున లెబనాన్‌లోని వివిధ ప్రాంతాల్లో హెజ్‌బొల్లాకు చెందిన 50కి పైగా మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

Updated Date - May 03 , 2026 | 11:20 AM