• Home » Latest News

Latest News

యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ

యూఎస్, ఇరాన్ యద్ధానికి ఇంకా పరిష్కారం రాలేదు: అరాఘ్చీ

అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇంకా పరిష్కారం దొరకలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. న్యాయం, ఇచ్చిపుచ్చుకొనే మార్గాల ద్వారానే రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం టెహ్రాన్‌లో దౌత్యవేత్తలు, విదేశాంగ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేదని పేర్కొన్నారు.

ఢిల్లీ-ఐజ్వాల్ విమానంలో కిడ్నీ పేషెంట్‌కు ట్రీట్మెంట్

ఢిల్లీ-ఐజ్వాల్ విమానంలో కిడ్నీ పేషెంట్‌కు ట్రీట్మెంట్

ఢిల్లీ నుంచి మిజోరంలోని ఐజ్వాల్‌కు వెళ్తున్న విమానంలో ఓ కిడ్నీ పేషెంట్‌కు డాక్టర్లు ఆపన్నహస్తం అందించారు. మెడికల్ చెకప్ కోసం ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు ఒక్కసారిగా శ్వాస అందక తీవ్రంగా ఆయాసపడ్డాడు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్లు స్పందించి పేషెంట్‌కు చికిత్స అందించారు.

భీమ్‌గల్ పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

భీమ్‌గల్ పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

మహిళా ఎస్ఐ కుటుంబానికి వేధింపులు.. యువకుల అరెస్ట్

మహిళా ఎస్ఐ కుటుంబానికి వేధింపులు.. యువకుల అరెస్ట్

మహిళా ఎస్‌ఐ కుటుంబాన్ని ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలు ఇద్దరు గంజాయితోపాటు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.

బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు

బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు

బాలాపూర్‌ నబిల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. గోదాంలో నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలాయి.

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారవేత్త అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహం గుండ్లపోచంపల్లికి చెందిన నేమారామ్ చౌదరిగా పోలీసులు గుర్తించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు.

ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

ఢిల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) పరిధిలోకి వచ్చే క్రీడా ప్రాంగణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించారు. గత నెల 18న ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని డీడీఏ అధికారులు తెలిపారు. డీడీఏ క్రీడా ప్రాంగణాల్లో ఆదివారం ఒక్కరోజే 2.5 టన్నుల చెత్తను సేకరించామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి