Share News

షుగర్ కంట్రోల్‌‌గా ఉన్నా కూడా అలసటగా ఉందా? కారణం ఇదే.!

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:17 PM

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అలసటగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మధుమేహానికి సంకేతం కావొచ్చు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

షుగర్ కంట్రోల్‌‌గా ఉన్నా కూడా అలసటగా ఉందా? కారణం ఇదే.!
Hidden Diabetes Symptoms

ఇంటర్నెట్ డెస్క్: మధుమేహం ప్రస్తుతం సాధారణ అనారోగ్య సమస్యగా మారింది. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల ఇది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అయితే కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ.. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనివల్ల గ్లూకోజ్ శరీర కణాలకు సరిగ్గా అందదు. ఫలితంగా శరీరానికి అవసరమైన శక్తి అందక అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి.


ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..

షుగర్ స్థాయి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి:

  • ఎప్పుడూ అలసటగా అనిపించడం.

  • తిన్న వెంటనే నిద్ర రావడం.

  • పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడం..

  • తరచూ తీపి పదార్థాలు తినాలనే కోరిక కలగడం.

  • చూపు కొద్దిగా మసకబారడం.

  • మెడ, బుగ్గల దగ్గర చర్మం నల్లగా మారడం.


ఏమి చేయాలి?

  • రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

  • తీపి పదార్థాలు తినడం తగ్గించాలి.

  • ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.

ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే.. మధుమేహాన్ని నివారించడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 19 , 2026 | 02:58 PM