Share News

ఆకలి లేకపోవడం వ్యాధికి సంకేతమా?

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:56 PM

ఆకలి తగ్గడం అనేది చాలా మంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం, ఎందుకంటే ఇది శరీరంలో ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

ఆకలి లేకపోవడం వ్యాధికి సంకేతమా?
Loss of Appetite Causes

ఇంటర్నెట్ డెస్క్: ఆకలి మన ఆరోగ్యానికి ముఖ్యమైన సూచిక. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు సహజంగా ఆకలి వేస్తుంది. అయితే ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఆకలి తగ్గిపోతే దాన్ని సాధారణంగా తీసుకోవడం సరైంది కాదు. ఇది శరీరంలో జరుగుతున్న కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి, ఆకలి తగ్గుతుంటే నిర్లక్ష్యం చేయకుండా.. దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం అవసరం.


ఆకలి తగ్గితే వచ్చే సమస్యలివే..

సమయానికి, సరైన పరిమాణంలో ఆహారం తీసుకోకపోతే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీని వల్ల బలహీనత, తలతిరగడం, చిరాకు, అలసట, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంగా ఆకలి లేకపోతే బరువు తగ్గడం, పోషకాహార లోపం, చర్మం, జుట్టు సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు కూడా కలగవచ్చు. రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా అనిపించవచ్చు.

ఆకలి తగ్గడం వ్యాధులకు సంకేతమా?

నిరంతరం ఆకలి లేకపోవడం.. కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు( గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం) థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత (బలహీనత, అలసట) కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఈ కారణాల వల్ల ఆకలి తగ్గిపోవచ్చు.


ఆకలి తగ్గడం 2–3 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, లేదా బరువు వేగంగా తగ్గితే, తరచుగా బలహీనంగా అనిపిస్తే, తిన్న తర్వాత వాంతులు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఇది శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతం కావచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • సమయానికి ఆహారం తీసుకోవాలి.

  • ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు.

  • పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

  • జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలు తగ్గించాలి.

  • రోజుకు తగినంత నీరు తాగాలి.

  • బాగా నిద్రపోవాలి.

  • రోజూ తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి.

  • యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

ఆకలి తగ్గడం చిన్న సమస్యలా అనిపించినప్పటికీ, ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావొచ్చు. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా, సరైన ఆహారం, జీవనశైలి పాటించడం ద్వారా నియంత్రించుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 17 , 2026 | 07:26 PM