Home » Latest News
భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేయడంతో పాటు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన ఘటనలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కోపైలట్ పేరు హమామ్ అల్ హమామీ అని, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్లు వివిధ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
భార్యభర్తలకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత.. పిల్లలే వారికి లోకం. వారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తే లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. చిన్నారులను బయటకు తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
మియాపూర్‌లోని ఓ లాడ్జిలో మెడికో కె. సృజన అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సృజనను రవి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఏఐతో రూపొందించిన పాటలను ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో 981 రష్యా అనుకూల యుద్ధ ప్రచార పాటలు ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి.
జమ్మూకశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బ్రిడ్జిని దాటింది.
బంగారం రేట్లు మరోసారి పెరిగాయి. నేటి ఉదయం 07:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి ధరలను ఓసారి పరిశీలిస్తే...
పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు.. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆపై యువతి పెళ్లి పేరు ఎత్తగానే మతం మారాలంటూ ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.
పంజాబ్‌లోని రాజోకె సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ముగ్గురు పాకిస్థానీయులపై బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు పాక్ సరిహద్దులోకి పరారయ్యారు.
ఆటో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇంధనం, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
లద్దాఖ్‌లోని 28 భౌగోళిక ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక పేర్లు ఖరారు చేసింది. పర్వతాలు, శిఖరాలు, హిమానీనదాలు, లోయలు, నదులు, సరస్సులు సహా వీటికి సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో గుర్తింపు లభించనుంది.