పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:04 AM
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు.
నరసరావుపేట, జులై 01: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముగ్గురు సజీవదహనం అయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో లారీ డ్రైవర్లలతోపాటు క్లీనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రఘురామపై బెదిరింపుల ఆరోపణలు.. జడ శ్రవణ్ కుమార్‌పై కేసు
జూన్‌లో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం
For More AP News And Telugu News