ఈ 6 వస్తువులను బహుమతిగా ఇస్తే.. మనస్పర్థలు వస్తాయట!
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:52 PM
ప్రేమను వ్యక్తపరచడానికి బహుమతులు ఇవ్వడం ఒక అందమైన సంప్రదాయం. అయితే కొన్ని వాస్తు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను జీవిత భాగస్వామికి లేదా ప్రేమించే వ్యక్తికి బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వ్యక్తికి ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి బహుమతులు ఇస్తుంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి లేదా ప్రేమించే వ్యక్తికి కానుకలు ఇవ్వడం అనేది ప్రేమను వ్యక్తపరిచే అందమైన మార్గం. అయితే కొన్ని సంప్రదాయ విశ్వాసాలు, వాస్తు నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు. అలాంటి బహుమతులు సంబంధాల్లో మనస్పర్థలకు దారితీస్తాయని నమ్మకం.
నల్లని దుస్తులు
చాలామంది స్టైలిష్ దుస్తులను కానుకగా ఇస్తుంటారు. అయితే నల్లని దుస్తులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని కొన్ని నమ్మకాలు చెబుతున్నాయి. నలుపు రంగు ప్రతికూలత, విచారం, దూరాన్ని సూచిస్తుందని.. దీని వల్ల అపార్థాలు, గొడవలు పెరిగే అవకాశం ఉందని అంటారు.
బూట్లు, చెప్పులు
బూట్లు లేదా చెప్పులను బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదని విశ్వసిస్తారు. ఇలాంటి బహుమతులు భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచి, విడిపోవడానికి సంకేతంగా భావిస్తారు.

మునిగిపోతున్న ఓడ చిత్రం
వాస్తు నమ్మకాల ప్రకారం.. మునిగిపోతున్న ఓడ ఫొటో లేదా పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వకూడదు. ఇది జీవితంలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో విభేదాలకు కారణమవుతుందని భావిస్తారు.
చేతిరుమాలు
చేతిరుమాళ్లను బహుమతిగా ఇవ్వడం కూడా కొన్ని సంప్రదాయాల్లో అశుభంగా పరిగణిస్తారు. ముఖ్యంగా దంపతులు ఒకరికొకరు చేతిరుమాళ్లు ఇచ్చుకోవడం వల్ల బాధలు, చిన్నచిన్న గొడవలు పెరిగే అవకాశం ఉందని నమ్మకం.

గాజు వస్తువులు
గాజుతో చేసిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదని అంటారు. గాజు సులభంగా పగిలిపోతుంది కాబట్టి, అది బంధం కూడా బలహీనపడుతుందనే సంకేతంగా భావిస్తారు. అందుకే గాజు వస్తువులను కానుకగా ఇవ్వకుండా ఉండాలని కొన్ని సంప్రదాయ విశ్వాసాలు సూచిస్తున్నాయి.
పెర్ఫ్యూమ్
పెర్ఫ్యూమ్ సాధారణంగా ఎక్కువగా ఇచ్చే బహుమతుల్లో ఒకటి. కానీ కొన్ని నమ్మకాల ప్రకారం దీన్ని కానుకగా ఇవ్వకూడదు. పెర్ఫ్యూమ్ సువాసన కాలక్రమంలో తగ్గిపోయినట్లే, ప్రేమ కూడా తగ్గిపోతుందని కొందరు విశ్వసిస్తారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్
జులైలో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుంది? ఆసక్తికర విషయాలు ఇవే!