Home » Kukatpally
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
ఆ ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నారు. పైగా కార్లో కొన్ని బీరు బాటిళ్లు పెట్టుకొని బయలుదేరారు. తాగిన మత్తులో కారు అదుపు తప్పనే తప్పింది.
Rash Driving: మద్యం మత్తులో యువతులు రెచ్చిపోయారు. రాష్ డ్రెవింగ్ చేసి వాహనదారులను ఢీకొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. వాహనదారులు ఫిర్యాదు చేయడంతో యువతులపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. తప్పతాగి నడిరోడ్డుపైకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమేకాకుండా వారిని బెదిరించారు.
ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా పీహెచ్‌డీ నోటిఫికేషన్లను జారీచేయడంలో అడ్మిషన్ల విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
రోడ్డు ప్రమాదం(Road accident)లో భారీగా రక్తాన్ని కోల్పోయి సృహ తప్పి పడిపోయిన వ్యక్తిని రక్షకభటులు అక్కున చేర్చుకుని అండగా నిలిచి ప్రాణాలను నిలబెట్టారు. సోమవారం మధ్యాహ్నం నిజాంపేట(Nizampet)లోని హైటెన్షన్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దినసరి కూలీగా పనిచేస్తున్న జట్టా గంగయ్య (44)కు తీవ్ర గాయాలయ్యాయి.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పరిచయమైన ఓ వివాహిత కోసం కూకట్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఇల్లు విడిచి వెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
కూకట్‌పల్లి రైతుబజార్(Kukatpally Raitubazar)) లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చి మిర్చి రూ.30, బజ్జి మిర్చి రూ.20, కాకరకాయ రూ.32లకు విక్రయిస్తున్నారు.
జేఎన్‌టీయూ(JNTU)లో పలువురు అధికారులు, ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎం.పద్మావతిని బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ సర్వీసెస్(బిక్స్) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.