Home » KTR
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. సబండ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. యువతకు స్కిల్ లేదంటున్న రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ అంటూ వ్యాఖ్యానించారు.
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్ రేపు మహాధర్నాకు సిద్ధమయ్యారు. అయితే మాజీ మంత్రి మహాధర్నా వేళ పట్టణంలో ఫ్లెక్సీల కలకలం రేగింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై పోరుబాటకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మాజీ మంత్రి.. నేతలకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు.
‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదని, 89 కేసులున్న రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే ‘‘క్రిమినల్ వేస్ట్’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, యువతను అవమానించే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మొత్తం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది. రేసుకు సంబంధించి 9, 10 సీజన్ల కోసం ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని తెలిపింది.