Share News

Seethakka: కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో సీఎం రేవంత్‌కు తెలుసు: మంత్రి సీతక్క

ABN , Publish Date - Dec 22 , 2025 | 03:07 PM

బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయాక ఎవరో వాళ్ళ ఇంట్లో పడి గుంజుకున్నట్టుగా ఫీలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Seethakka: కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో సీఎం రేవంత్‌కు తెలుసు: మంత్రి సీతక్క
Minister Seethakka

హైదరాబాద్, డిసెంబర్ 22: బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క (Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్‌ను ఫుట్‌బాల్ ఆడుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రపంచ ఆటగాడితోనే ఫుట్‌బాల్ ఆడినట్లు తెలిపారు. కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎట్లా ఆడాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. అధికారం పోయిందని అక్కసుతో హరీష్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు మించి తప్పుడు కూతలు, తప్పుడు మాటలు, గ్లోబల్ ప్రచారం ఎవరు చేయరని విమర్శించారు.


అధికారం పోయాక ఎవరో వాళ్ళ ఇంట్లో పడి గుంజుకున్నట్టుగా ఫీలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారని.. సరిగా పని చేయకపోతే ప్రజలు అధికారం నుంచి దింపేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ మంచిగా పని చేయనప్పుడు కాంగ్రెస్‌ను కూడా దించుతారని అన్నారు. కవితకు జవాబు చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలతో తాము పాజిటివ్ దృక్పథంతో ఉంటామని స్పష్టం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఫుట్‌బాల్ ఆడుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌ది అంతా నటనే: మంత్రి జూపల్లి కృష్ణారావు

వెన్నుపోటుకు మారు పేరు సీఎం రేవంత్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 03:11 PM