Share News

Harish Rao: వెన్నుపోటుకు మారు పేరు సీఎం రేవంత్..

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:54 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదన్నారు.

Harish Rao: వెన్నుపోటుకు మారు పేరు సీఎం రేవంత్..
Harish Rao

హైదరాబాద్, డిసెంబర్ 22: సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి... రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డికి నీతి జాతి ఏమైనా ఉందా అని నిలదీశారు. కేసీఆర్ స్టేట్స్‌మెన్‌లా మాట్లాడితే.. రేవంత్ స్ట్రీట్ రౌడీ మాదిరి మాట్లాడారని విమర్శించారు. త్యాగాల చరిత్ర తమది అని.. వెన్నుపోటుకు మారు పేరు రేవంత్ రెడ్డి అని కామెంట్స్ చేశారు. సంకుచిత, మరగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ ప్రజల ముందు నిలబెట్టారని అన్నారు.


కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే.. సీఎం, నీళ్ళ మంత్రికి ఎందుకంత నొప్పి అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో నీటి వాటాను తగ్గించుకున్నారని ప్రశ్నించారు. 45 టీఎంసీలకు.. మంత్రి ఉత్తమ్ స్వయంగా తన దస్తూరితో కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉత్తర కుమారుడిలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అనుభవమంతా దోపిడికి, లూటీకి పనికొస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేను కొంటూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు.


రూ.50 కోట్లకు రేవంత్ పీసీసీ పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌కు ఒక స్టాండ్, సిద్దాంతం, పద్ధతి లేదన్నారు. ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేసిందే కేసీఆర్ అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడైనా ప్రిపేర్ అయ్యి ప్రెస్‌మీట్స్ నిర్వహించాలని ఎద్దేవా చేశారు. నీళ్ళ మంత్రి ఉత్తమ్‌కు సగం సగం నాలెడ్జ్ మాత్రమే ఉందంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు.


ఇవి కూడా చదవండి...

బుక్‌ఫెయిర్ సొసైటీ అక్రమాలు వెలుగులోకి.. నిజమెంత?

కేసీఆర్‌ది అంతా నటనే: మంత్రి జూపల్లి కృష్ణారావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 02:06 PM