Home » KTR
కాంగ్రెస్ నేతలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు.
Congress Vs BRS: సెక్రటేరియట్ కట్టడానికే ఒక టర్మ్ అంత వాడుకున్నారంటూ బీఆర్‌ఎస్‌పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని.. వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరమ్ గురవారెడ్డి సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్ ఓ పిరికి దద్దమ్మ అని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఆయన్ను వదిలిపెట్టేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
CM Vs KTR: దుబాయ్‌లో కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని సీఎం రేవంత్ అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించినట్లు చెప్పారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని.. అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు.
Telangana HCA Scam: హెచ్‌సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపిస్తూ సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఇద్దరితో పాటు మరికొంత మందిపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.
MLA KTR: చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఇంటిముందు ఆయన విగ్రహం పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ హక్కులను చంద్రబాబుకు రేవంత్ దారదత్తం చేస్తున్నారని ఫైరయ్యారు.
బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకిచ్చారు
ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమైంది.. రేవంత్‌రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు ధారదత్తం చేస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు.