Home » KonaSeema
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న జిల్లాలోనే వివిధ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని దేవాలయాలకు జిల్లా యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు.
కోకో పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి మర్కెట్‌లో పలికే గిట్టుబాటు ధర క్షేత్రస్థాయిలో రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరిలో కోకోను అంతర పంటగా అభివృద్ధి చేసి జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దాలని రైతులకు ఆయన సూచించారు.
దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని అమలాపురం ఆర్డీవో కె.మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మంగళవారం చంద్రప్రభ, సూర్యవాహనాల గ్రామోత్సవాలు జరిగాయని, భక్తుల కోర్కెలు తీర్చే శ్రీకరుడు, సర్వశుభాలను ఇచ్చే శుభకరుడు లక్ష్మీనరసింహస్వామి ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యేకంగా ఉన్న అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో ఉత్సవాలు ప్రారంభించామన్నారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ధ్రువీకరించిన ఆక్వా రంగ చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ, మత్స్యశాఖ, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు.
జిల్లాలోని వశిష్ఠ, గౌతమి నదుల్లో ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్‌లను గుర్తించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. గుర్తించిన రీచ్‌ల అనుమతుల మంజూరు కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించబోమన్నారు.
ఈ నెల 4 నుంచి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు సంపూర్ణ పారిశుధ్య చర్యలపై ప్రత్యేకంగా 860 మంది సిబ్బందిని నియమించినట్టు జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధి కారి జె.వెంకటరావు సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వ హణపై గురువారం కలెక్టరేట్‌లో రెవె న్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, ఇతర శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయ సమావేశం నిర్వహించా రు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం తోపాటు విద్యావికాసం దిశగా పాఠశాలలను నడిపించేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. దీనికిగానూ మౌలిక వసతుల కల్పనకు పాఠశాలల్లో ఇప్పటివరకూ జరిగిన నిధుల వినియోగం, చేపట్టిన పనులు ఏవిధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి, ఇంకా మిగిలిన పనులకు ఎంతమేరకు నిఽధులు కావాల్సి ఉందో ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ ట్రాన్స్‌ఫెరెన్సీ (ఏపీశాట్) ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా విద్యలో ప్రగతి సాధించేందుకు అమలుచేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకుంటోంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించాలని డీఈవో షేక్ సలీంబాషా పేర్కొన్నారు. ముమ్మిడివరం శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక విద్య ప్రేరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమవుతుందన్నారు.