పదో తరగతి విద్యార్థులకు వీడియో పాఠ్యాంశాలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:22 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించడంతో పాటు పాఠ్యాంశాలకు పట్టు సాధించే విధంగా ప్రత్యేక వీడియో క్లిప్పింగ్‌లను రూపొందించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. నిపుణులైన సబ్జెక్టు టీచర్లు రూపొందించిన వీడియో పాఠ్యాంశాల క్లిప్పింగ్‌లను బుధవారం అమలాపురం జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

అమలాపురం టౌన్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించడంతో పాటు పాఠ్యాంశాలకు పట్టు సాధించే విధంగా ప్రత్యేక వీడియో క్లిప్పింగ్‌లను రూపొందించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. నిపుణులైన సబ్జెక్టు టీచర్లు రూపొందించిన వీడియో పాఠ్యాంశాల క్లిప్పింగ్‌లను బుధవారం అమలాపురం జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి పరీక్షల విభాగం, సబ్జెక్టు నిపుణులు ప్రత్యేకంగా రూపొందించిన వీడియో పాఠ్యాంశాలను పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఐఎఫ్‌పీ ప్యానల్స్ ఉపయోగించి చూపించి వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సబ్జెక్టులో మెలకువలు పొందవచ్చునన్నారు. పాఠ్యాంశాలతో పాటు పట్టికలు, ప్రశ్నపత్రాల విశ్లేషణ వంటివి వీడియో క్లిపింగ్‌ల ద్వారా సిద్ధం చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బీర హనుమంతరావు తెలిపారు. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వీడియో క్లిప్పింగ్‌లు ఎంతగానో దోహదపడతాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్‌ఎం విజయకుమారి, సబ్జెక్టు నిపుణుడు టీఎస్‌వీఎస్ సూర్యనారాయణమూర్తి, డి.ఉదయం తదితరులు పాల్గొన్నారు.