Share News

టెన్త్‌లో అత్యున్నత ఫలితాలకు ప్రేరణ

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:11 AM

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించాలని డీఈవో షేక్‌ సలీంబాషా పేర్కొన్నారు. ముమ్మిడివరం శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక విద్య ప్రేరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమవుతుందన్నారు.

టెన్త్‌లో అత్యున్నత ఫలితాలకు ప్రేరణ

ముమ్మిడివరం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించాలని డీఈవో షేక్‌ సలీంబాషా పేర్కొన్నారు. ముమ్మిడివరం శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక విద్య ప్రేరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమవుతుందన్నారు. 500 మార్కులకు పైగా సాధించిన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపడమే ప్రత్యేక ప్రేరణ తరగతుల ఉద్దేశమన్నారు. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇస్తామని, 600 కు 600 మార్కులు సాధించేలా అవసరమైన మోటివేషన్‌ తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతీ సబ్జెక్టులో ఉత్తమ మార్కులు పొందేలా నిపుణుల చేత మార్గదర్శనం చేయించనున్నట్లు చెప్పారు. 520 మార్కులు పైగా సాధించిన విద్యార్థులను మండలాల వారీగా ఒకచోట సమీకరించడం, విద్యార్థుల రవాణా కోసం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో తగిన వాహనాలు ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటామన్నారు. మండల నోడల్‌ హెచ్‌ఎం, సీనియర్‌ హెచ్‌ఎం, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు శిక్షణకు హాజరయ్యేలా బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి హాజరుకాని ఏదైనా పాఠశాల ఉంటే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సీనియర్‌ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల వివరాలను మండల విద్యాశాఖాధికారి నోడల్‌ హెచ్‌ఎంతో చర్చించి గ్రూపులో అందించాలన్నారు. పూర్తి శ్రద్ధతో శిక్షణ తీసుకుని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. విద్యార్థులను శిక్షణ కార్యక్రమానికి సురక్షితంగా తరలించే బాధ్యత మండల విద్యాశాఖ అధికారులపై ఉంటుందన్నారు. సమావేశంలో ఎగ్జామినేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.హనుమంతరావు ఉన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:11 AM