Share News

సమన్వయంతో పరీక్షల సక్రమ నిర్వహణ: డీఆర్వో

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:17 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధి కారి జె.వెంకటరావు సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వ హణపై గురువారం కలెక్టరేట్‌లో రెవె న్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, పోలీస్‌, విద్యుత్‌, ఆర్టీసీ, పోస్టల్‌, ఇతర శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయ సమావేశం నిర్వహించా రు.

సమన్వయంతో పరీక్షల సక్రమ నిర్వహణ: డీఆర్వో

కాకినాడ సిటీ, జనవరి 30 (ఆంధ్ర జ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధి కారి జె.వెంకటరావు సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వ హణపై గురువారం కలెక్టరేట్‌లో రెవె న్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, పోలీస్‌, విద్యుత్‌, ఆర్టీసీ, పోస్టల్‌, ఇతర శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా డీఆర్వో వెంకట రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 5 నుం చి 19 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు, మా ర్చి 1 నుంచి 20 వరకు థియరీ పరీ క్షలు జరగనున్నాయన్నారు. ఈ పరీక్ష లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. కాకినాడ జిల్లాలో ప్రాక్టికల్‌ పరీ క్షలకు 89, పబ్లిక పరీక్షలకు 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. పరీక్ష సమయంలో నిరంత రాయంగా విద్యుత్‌ సరఫరా చేయా లని విద్యుత్‌ శాఖను ఆదేశించారు. ప్రశ్నాపత్రాల తరలింపులో తగిన ఎస్కార్ట్సు, పరీక్షా కేంద్రాల వద్ద బం దోబస్తు ఏర్పాటుచేయాలని పోలీస్‌ శాఖకు సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరు కునేలా ఆర్టీసీ ఆయా పరీక్షా కేంద్రాల రూట్లలో తగినన్ని బస్సులను కేటా యించాలన్నారు. ఇంటర్మీడియట్‌ పరీ క్షల నిర్వహణలో అవసరమైన ఇన్విజి లేటర్ల నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధి కారులతో సమన్వయం చేసుకోవాల న్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శివిరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి జీజీకే నూక రాజు, కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్ష ప్రత్యేక అధికారి కె అప్పలరాజు, జిల్లా పోలీస్‌, విద్యా, పంచాయతీ, విద్యుత్‌, ఆర్టీసీ, పోస్టల్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:17 AM