విద్యావికాసం దిశగా..
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:16 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం తోపాటు విద్యావికాసం దిశగా పాఠశాలలను నడిపించేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. దీనికిగానూ మౌలిక వసతుల కల్పనకు పాఠశాలల్లో ఇప్పటివరకూ జరిగిన నిధుల వినియోగం, చేపట్టిన పనులు ఏవిధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి, ఇంకా మిగిలిన పనులకు ఎంతమేరకు నిఽధులు కావాల్సి ఉందో ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ ట్రాన్స్‌ఫెరెన్సీ (ఏపీశాట్) ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా విద్యలో ప్రగతి సాధించేందుకు అమలుచేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకుంటోంది.

పాఠశాలల్లో ఏపీశాట్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు
మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకూ జరిగిన నిధులు వినియోగమే లక్ష్యం
ఇంకా మిగిలిన పనులకు నిధులు ఎంతమేర కావాల్సి ఉందో ప్రతిపాదనలు
కాకినాడ రూరల్, జనవరి 30(ఆంరఽధజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం తోపాటు విద్యావికాసం దిశగా పాఠశాలలను నడిపించేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. దీనికిగానూ మౌలిక వసతుల కల్పనకు పాఠశాలల్లో ఇప్పటివరకూ జరిగిన నిధుల వినియోగం, చేపట్టిన పనులు ఏవిధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి, ఇంకా మిగిలిన పనులకు ఎంతమేరకు నిఽధులు కావాల్సి ఉందో ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ ట్రాన్స్‌ఫెరెన్సీ (ఏపీశాట్) ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా విద్యలో ప్రగతి సాధించేందుకు అమలుచేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకుంటోంది.
సమగ్రంగా శ్రేణుల వారీగా..
కాకినాడ జిల్లాలోని 35 పాఠశాలల్లో 18,880 మంది విద్యార్థుల ప్రగతిని సామాజిక తనిఖీ ద్వారా నిర్వహిస్తుండగా, వాటిలో ఇప్పటికే 10 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని సామాజిక తనిఖీ పూర్తికాగా మిగిలిన 25 పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు, సమకూరుతున్న వసతులు, స్టూడెంట్ కిట్లు, మధ్యాహ్న భోజన పఽథకం, పాఠశాల భద్రత, విద్యార్థుల రక్షణతోపాటు శ్రేణుల వారీగా వారి ప్రగతిని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా క్రీడాస్థలాలు, ఇతర మౌలిక సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయో తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయుల వివరాలు, భర్తీచేయాల్సిన ఖాళీలు, అవసరమయ్యే తరగతి గదులు, కావాల్సి బోధనోపకరణాల వివరాలను నమోదుచేసి రికార్డులను పరిశీలించి వాటి ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దడంతోపాటు అన్ని అంశాలపై అవగాహన పెంచేందుకు జిల్లాలోని 1280 పాఠశాలల ఎస్‌ఎంసీ చైర్మన్లు, సభ్యులతో సహా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. దీనిని యాజమాన్య కమిటీలకు, ఉపాధ్యాయులకు రెండు దశల్లో నిర్వహించారు.
విద్యాభివృద్ధే లక్ష్యం
పాఠశాలల్లో ఇప్ప టికే పూర్తయిన వివిధ పనులను పర్యవేక్షించడంతో మరికొన్ని మౌలి క వసతుల కల్పన దిశగా జిల్లాలో ఎంపికచేసిన పాఠశాలల్లో సా మాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని విభాగాలకు సంబందించిన అంశాలను వారు పరిశీలిస్తున్నారు. ఎస్ ఎంసీ చైర్మన్లు, సభ్యులు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు పాఠశాలల అభివృద్ధి, సమకాలీన సమస్యలు వాటి పరిష్కారాలపై అవగాహన పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను ఇప్పటికే పూర్తిచేశాం.
- సీహెచ్ నాగేశ్వరరావు, సీఎంవో, సమగ్ర శిక్ష