• Home » KonaSeema

KonaSeema

 నేటి నుంచి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల తనిఖీ

నేటి నుంచి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల తనిఖీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని ఎన్టీఆర్‌ భరోసా ఆరోగ్య పెన్షన్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. నెలకు రూ.15వేలు పెన్షన్‌ పొందుతూ మంచానికి, వీల్‌చైర్లకు పరిమితమైన 373 మంది పెన్షన్‌దారులు మస్క్యులర్‌ డిస్ర్టోపి, యాక్సిడెంట్‌ ప్రభావిత వ్యక్తులకు జిల్లాలో 120 మందికి పెన్షన్లు అందుతున్నాయన్నారు. మొత్తంగా 493 మంది అర్హతను ఈ ప్రక్రియలో వైద్య నిపుణులతో కూడిన బృందాలు పరిశీలించనున్నాయని చెప్పారు.

జిల్లావ్యాప్తంగా 18,799 మంది విద్యా కమిటీ సభ్యులకు శిక్షణ

జిల్లావ్యాప్తంగా 18,799 మంది విద్యా కమిటీ సభ్యులకు శిక్షణ

పాఠశాల యాజమాన్య కమిటీలకు శిక్షణలో భాగంగా జిల్లావ్యాప్తంగా 18,799 మంది కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్టు సమగ్ర శిక్ష సీఎంవో చామంతి నాగేశ్వర్రావు చెప్పారు. శుక్రవారం ఆయన తొండంగిలో జరుగుతున్న రిసోర్స్‌ప ర్సన్ల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. హాజరైన ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్లను ఉద్దేశించి మా ట్లాడారు.

రోడ్ల పనులు సకాలంలో చేపట్టాలి

రోడ్ల పనులు సకాలంలో చేపట్టాలి

జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ షగిలి అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, వేములపాలెం, పెద్దిపాలెం, ఉత్తరకంచి గ్రామాల్లో గురువారం కలెక్టర్‌ పర్యటించారు. వేములపాలెం, ఉత్తరకంచి, పెద్దిపాలెంలలో రోడ్ల పరిస్థితిని పరిశీలించారు.

అంతర్వేది కల్యాణోత్సవాలపై సమీక్ష

అంతర్వేది కల్యాణోత్సవాలపై సమీక్ష

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ చెప్పారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలోని కల్యాణ షెడ్డులో ఉత్సవాల సమీక్షా సమావేశాన్ని అమలాపురం ఆర్డీవో కె.మాధవి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.

 7 నుంచి కోనసీమ క్రీడోత్సవం

7 నుంచి కోనసీమ క్రీడోత్సవం

ఈ నెల 7 నుంచి కోనసీమ క్రీడోత్సవం పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అమలాపురంలో రైతుబజార్‌ పునఃప్రారంభానికి చర్యలు

అమలాపురంలో రైతుబజార్‌ పునఃప్రారంభానికి చర్యలు

జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉన్న రైతు బజార్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడించారు. రైతు బజార్‌ ప్రాంగణంలో శనివారం రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన రైతులతో పాటు ఉద్యాన, మార్కెటింగ్‌, మత్స్యశాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.

 జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులు మంజూరు చేయాలి

జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులు మంజూరు చేయాలి

ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. తీర ప్రాంతం వెంబడి ఆక్వా జోన్‌, ఆక్వాయేతర జోన్లలో ఎంతమేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో గుర్తించి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్‌ మ్యాప్‌లతో సహా బృందాలు సర్వే నిర్వహించాలన్నారు.

విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయదుర్గా అమ్మవారికి, శ్రీదేవి , భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామికి వైఖానస పండితులు పూజలు నిర్వహించారు.

 ఒకరోజు ముందుగానే పింఛన్లు

ఒకరోజు ముందుగానే పింఛన్లు

గతంలో ఎన్నడూలేని విధంగా మళ్లీ మరోసారి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 బుధవారం అయినప్పటికీ నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాలతో పెన్షన్‌దారులు గడపాలన్న లక్ష్యంతో ఒకరోజు ముందుగానే డిసెంబరు 31న పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌ తెలిపారు.

ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరపాలి

ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరపాలి

సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించారు. అమలాపురం రూరల్‌ మండలం పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో 11 ప్రభల ఉత్సవ కమిటీ సమావేశం శ్రీపాద వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి