Share News

రోడ్ల పనులు సకాలంలో చేపట్టాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 01:10 AM

జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ షగిలి అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, వేములపాలెం, పెద్దిపాలెం, ఉత్తరకంచి గ్రామాల్లో గురువారం కలెక్టర్‌ పర్యటించారు. వేములపాలెం, ఉత్తరకంచి, పెద్దిపాలెంలలో రోడ్ల పరిస్థితిని పరిశీలించారు.

రోడ్ల పనులు సకాలంలో చేపట్టాలి

మూడు గ్రామాల్లో పర్యటన.. సమస్యల పరిశీలన

ప్రత్తిపాడు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ షగిలి అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, వేములపాలెం, పెద్దిపాలెం, ఉత్తరకంచి గ్రామాల్లో గురువారం కలెక్టర్‌ పర్యటించారు. వేములపాలెం, ఉత్తరకంచి, పెద్దిపాలెంలలో రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. అలాగే అంగన్‌వాడీ కేం ద్రాలను, పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద రోడ్ల నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేయాలన్నారు. వేములపాలెంలో శిఽథిల పాఠశాల భవనాన్ని సందర్శించి నూతన పాఠశాల భవనానికి అవసరమైన స్థలాన్ని గ్రా మస్తులు సూచించడంతో కలెక్టర్‌ ఆ స్థలాన్ని పరిశీలించి నూతన పాఠశాల భవనానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఉత్తరకంచి గ్రామంలో అసంపూర్తి పనులతో నిలిచిపోయిన రెండు అం గన్‌వాడీ భవనాలు, ఒక సచివాలయ భవనాల దుస్థితిని ఆ గ్రామ సర్పంచ్‌ మంతెన శ్రీను, సుబ్బారెడ్డి సాగర్‌ చైర్మన్‌ ఇళ్ళ అప్పారావుకు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వేములపాలెంలోని గ్రామదేవత ఆలయం తదితర సమస్యలను టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి లొండా లోవరాజు, గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రత్తిపాడులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. వైద్యాధికారులు స్వప్న, సౌమ్యలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వార్డులో వైద్య సేవ లు పొందుతున్న మహిళతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్యుల ప్రవర్తన, భోజన వసతి వంటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఆసుపత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి శస్త్రచికిత్స నిపుణు లను ఏర్పాటుచేయాలని వైద్యులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న హోమియో ఆసుపత్రిని కూడా కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే పెద్దిపాలెం ఆసుపత్రిని కలెక్టర్‌ సందర్శించి ఆసుపత్రి పరిశుభ్రంగా ఉం డాలని, వైద్యాధికారి యశశ్వికి సూచించారు. అంగన్‌వాడీ కేందాల్ర్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు ప్రతి దినం సక్రమంగా పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. ఉత్తరకంచిలో పల్లె పండుగలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని తహశీల్దార్‌ సూర్యప్రభ, ఎంపీడీవో కుమార్‌బాబు, పీఆర్‌జేలతో కలిసి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఎంఎస్‌ ఐటీసీఈఈ సీహెచ్‌ రత్నంరాజు, ఈవోపీఆర్డీ కాశీ విశ్వనాఽథ్‌, సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్‌ఐ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 01:10 AM