Share News

జిల్లావ్యాప్తంగా 18,799 మంది విద్యా కమిటీ సభ్యులకు శిక్షణ

ABN , Publish Date - Jan 03 , 2025 | 01:11 AM

పాఠశాల యాజమాన్య కమిటీలకు శిక్షణలో భాగంగా జిల్లావ్యాప్తంగా 18,799 మంది కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్టు సమగ్ర శిక్ష సీఎంవో చామంతి నాగేశ్వర్రావు చెప్పారు. శుక్రవారం ఆయన తొండంగిలో జరుగుతున్న రిసోర్స్‌ప ర్సన్ల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. హాజరైన ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్లను ఉద్దేశించి మా ట్లాడారు.

జిల్లావ్యాప్తంగా 18,799 మంది విద్యా కమిటీ సభ్యులకు శిక్షణ

తొండంగి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పాఠశాల యాజమాన్య కమిటీలకు శిక్షణలో భాగంగా జిల్లావ్యాప్తంగా 18,799 మంది కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్టు సమగ్ర శిక్ష సీఎంవో చామంతి నాగేశ్వర్రావు చెప్పారు. శుక్రవారం ఆయన తొండంగిలో జరుగుతున్న రిసోర్స్‌ప ర్సన్ల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. హాజరైన ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్లను ఉద్దేశించి మా ట్లాడారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అక్టోబరు 7, 8, తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా అగిరపల్లి వద్ద రాష్ట్రస్థాయిలో ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు చైర్మన్లకు ఆర్పీలుగా శిక్షణ ఇచ్చారన్నారు. జిల్లాలో రెండు డివిజన్లకు కలిసి పది మంది శిక్షణ పూర్తి చేశారన్నారు. డిసెంబరు 30న వీరి ద్వారా మండలానికి ఐదుగురు చొప్పున 21 మండలాలకు 105 మంది ఆర్పీలకు శిక్షణ ఇచ్చామన్నారు. వీరి ద్వారా మండలస్థాయిలో డిసెంబరు 31, జనవరి 2వ తేదీల్లో 2556 మందికి శిక్షణ ఇచ్చామ న్నారు. వీరి ద్వారా పాఠశాలల స్థాయిలో 18,799 మంది విద్యాకమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు, విఽధులు- బాధ్యతలు, బాలల హక్కులు - పరిరక్షణ, సమావేశాలు నిర్వహణ - విధివిధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు - పరిష్కారాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఎంఈవోలు షేక్‌ బాబ్జి, అనిశెట్టి సుబ్బిరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 01:11 AM