నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల తనిఖీ
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:22 AM
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పెన్షన్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నెలకు రూ.15వేలు పెన్షన్ పొందుతూ మంచానికి, వీల్‌చైర్లకు పరిమితమైన 373 మంది పెన్షన్‌దారులు మస్క్యులర్ డిస్ర్టోపి, యాక్సిడెంట్ ప్రభావిత వ్యక్తులకు జిల్లాలో 120 మందికి పెన్షన్లు అందుతున్నాయన్నారు. మొత్తంగా 493 మంది అర్హతను ఈ ప్రక్రియలో వైద్య నిపుణులతో కూడిన బృందాలు పరిశీలించనున్నాయని చెప్పారు.

అమలాపురం టౌన్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పెన్షన్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నెలకు రూ.15వేలు పెన్షన్ పొందుతూ మంచానికి, వీల్‌చైర్లకు పరిమితమైన 373 మంది పెన్షన్‌దారులు మస్క్యులర్ డిస్ర్టోపి, యాక్సిడెంట్ ప్రభావిత వ్యక్తులకు జిల్లాలో 120 మందికి పెన్షన్లు అందుతున్నాయన్నారు. మొత్తంగా 493 మంది అర్హతను ఈ ప్రక్రియలో వైద్య నిపుణులతో కూడిన బృందాలు పరిశీలించనున్నాయని చెప్పారు. ఇందుకోసం మూడు వైద్య బృందాలను నియమించినట్లు చెప్పారు. నిర్దేశిత తేదీల్లో పెన్షన్ లబ్ధిదారుని ఇంటిని సందర్శించి లబ్ధిదారుని భౌతిక ఆరోగ్య స్థితిని వైద్య పరంగా పరిశీలిస్తారు. ప్రతీ వైద్య బృందంలో ఒక ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు, సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. సంబంధిత లబ్ధిదారులకు ముందుగానే సమాచారం తెలియచేస్తారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆ సమయంలో ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని కోరారు. అందుబాటులో లేని లబ్ధిదారుల పెన్షన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పెన్షన్ వెరిఫికేషన్ బృందాలకు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కార్తీక్‌రెడ్డి, డీఎంహెచ్‌వో దొరబాబు, జీఎస్‌డబ్ల్యుఎస్ నోడల్ అధికారి త్రినాథరావుల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.