Home » Kishan Reddy G
ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందగానే ఆయన ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, ఆచరణలో మాత్రం కాలు కదలడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
Bandi Sanjay: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరచి పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మోదీపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
Kishan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి రాబోతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇలాగే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
ప్రధాని మోదీ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ కులంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Kishan Reddy: రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను బీజేపీ అండగా ఉందని అన్నారు.
సీఎం హోదాలో ఉండి ప్రధాని మోదీపై అవాకులు, చవాకులు పేలుతారా..?’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాని మోదీ బీసీనా..? కాదా..? అన్న అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రంలో మార్పు రాలేదు... మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉంది’’ అని అన్నారు.