‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీకి 3 సీట్లూ రావు: మధుసూదన్‌రెడ్డి
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:56 AM
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సంబరపడుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సంబరపడుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారు. అధికారం మాట అటుంచి.. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లు కూడా రావు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పదేళ్లు అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
గూడెం, కాట వివాదంపై దామోదర అభిప్రాయం సేకరణ..
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కాట శ్రీనివా్‌సగౌడ్‌ల మధ్య వివాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డిలతో ఏర్పాటైన ద్విసభ్య విచారణ కమిటీ.. మంత్రి దామోదర రాజనర్సింహను ఆయన నివాసంలో కలిసింది. ఈ వివాదానికి సంబంధించి ఆయన అభిప్రాయాన్ని తీసుకుంది.