Share News

Kishan Reddy: డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం ఆపండి

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:06 AM

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తున్న పార్టీలే నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌)పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం ఆపండి

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తున్న పార్టీలే నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌)పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు తగ్గబోవని స్పష్టం చేశారు. 2009లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన విధంగానే ఈసారి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్పారు. త్వరలో జనగణన ప్రారంభమవుతుందని ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వెల్లడించారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళా ఉపాధ్యాయులు, పట్టభద్రులు 90శాతం మంది బీజేపీకే ఓటువేసినట్లు సర్వేలో తేలిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళాశక్తిని గుర్తించడం వల్లే దేశ ప్రథమ పౌరురాలుగా ద్రౌపది ముర్మును, ఆర్థిక మంత్రిగా నిర్మలకు ప్రధాని మోదీ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ముఖ్యులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 04:06 AM