Home » KCR
ఊరు మార్చి.. పేరు మార్చి.. అంచనాలు మార్చి.. అవినీతి, అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఈ విషయాను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కేవలం కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారం అమలుచేయడం, తానే ఇంజనీర్లా వ్యవహరించడం, ప్లానింగ్‌లో, నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయి.
బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ‘కాళేశ్వర’ అస్త్రం చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అధికారపక్షానికి సరికొత్త ఆయుధంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ అందించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని సంచలన విషయాలు బయటపెట్టారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గువ్వల బాలరాజుతో పాటు మరో ఇద్దరు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.
కేసీఆర్‌కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ మాత్రమే కాదు.. ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది.