Share News

KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో చండీయాగం

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:11 AM

సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చండీయాగం నిర్వహించినట్లు తెలిసింది.

KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో చండీయాగం

  • పాల్గొన్న కేసీఆర్‌ దంపతులు

గజ్వేల్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చండీయాగం నిర్వహించినట్లు తెలిసింది. ఈ యాగంలో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడిన కేసీఆర్‌, ఆరోగ్యం కుదుటపడటంతో చండీయాగం నిర్వహించినట్లు తెలిసింది. కుటుంబంలో నెలకొన్న అశాంతి నేపథ్యంలో పలువురి సూచన మేరకు కేసీఆర్‌ యాగాన్ని జరిపినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ పాల్గొన్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

 ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

Read Latest TG News and National News

Updated Date - Sep 06 , 2025 | 05:11 AM