KCR Diwali Greetings: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:14 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. అజ్ఞానపు తమస్సును తొలగించుకుని, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని..
హైదరాబాద్, అక్టోబర్ 19: దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు తమస్సును తొలగించుకుని, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అందిస్తుందని కేసీఆర్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంచిందని, తెలంగాణ ప్రజల జీవితాలలో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలని కేసీఆర్ ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి