Share News

BRS Silver Jubilee Public Meeting: తెలంగాణకు నంబర్ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌: కేసీఆర్‌

ABN , First Publish Date - Apr 27 , 2025 | 01:38 PM

BRS Silver Jubilee Public Meeting: బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఏర్పాటై 24 వసంతాలు పూర్తై.. 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు.

BRS Silver Jubilee Public Meeting: తెలంగాణకు నంబర్ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌: కేసీఆర్‌
BRS Public Meeting

Live News & Update

  • Apr 27, 2025 19:55 IST

    కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మేం పడగొట్టం: కేసీఆర్‌

    • రానున్న మూడేళ్లు సక్రమంగా చేయకపోతే ప్రజలే వీపులు పగలగొడతారు.

    • ప్రజలకు అండగా ఉంటాం.. వారికోసం పోరడాదాం.

    • రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ముందుకు సాగుదాం.

    • చిరునవ్వులు చిందించే తెలంగాణను నిర్మించుకుందాం.

    • యావత్‌ తెలంగాణ సమాజానికి, BRS కేడర్‌కు రజతోత్సవ శుభాకాంక్షలు.

  • Apr 27, 2025 19:54 IST

    బీజేపీ 11 ఏళ్లలో 11 రూపాయిలు కూడా ఇయ్యలే: కేసీఆర్‌

    • తెలంగాణపై మోదీ ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు.

    • ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు.

    • బలం ఉందని చంపుకుంటూ పోవడం సరికాదు.

    • ఆపరేషన్ కగార్‌ను ఆపేయాలి.

    • చర్చలకు కేంద్రం ముందుకు రావాలి.

  • Apr 27, 2025 19:50 IST

    25 నుంచి 30% కమీషన్లు అంటే కాంట్రాక్టర్లు వాపోతున్నారు: కేసీఆర్‌

    • కేసీఆర్‌ నువ్వు అసెంబ్లీకి రా అంటున్నారు..

    • నేనెందుకు మా పిల్లలు అడిగితేనే సమాధానం చెప్పట్లే.

    • మళ్లీ విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.

  • Apr 27, 2025 19:46 IST

    ఎవరి లెక్కలు ఏంటో చూద్దాం: కేసీఆర్‌

    • అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ ఫెయిలైంది.

    • కాంగ్రెస్సోళ్లకు కమీషన్లు తీసుకోవడం.. సంచులు మోయడమే తెలుసు.

  • Apr 27, 2025 19:46 IST

    పోలీసులు ఎందుకు కక్ష గట్టారు: కేసీఆర్

    • పోలీసులూ.. మీ డైరీల్లో రాసిపెట్టుకోండి.

    • మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్సే.

    • BRS సోషల్‌ మీడియా వారియర్స్‌పై కేసులు ఎందుకు?

    • ఇకపై నేను కూడా ఊరుకోను.. బయల్దేరతా..

  • Apr 27, 2025 19:46 IST

    ఏది అమ్మాలో.. ఏది అమ్మకూడదో తెలివి ఉండాలి: కేసీఆర్‌

    • యూనివర్సిటీలను ఎవరైనా అమ్ముతారా?

    • అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిలైంది.

    • ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ ఎందుకు పూర్తి చేయట్లేదు.

    • పేదల కోసం కేసీఆర్‌ కిట్లు పెట్టాం.

    • కేసీఆర్‌ కిట్‌ను ఎందుకు బంద్‌ చేశారు.

    • ఆరోగ్యశ్రీ వైఎస్‌ఆర్‌ తెచ్చారు.. ఆ పథకం బాగుందని కొనసాగించాం.

    • ఇప్పుడు కాంగ్రెస్‌ పాలకులు.. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.

    • సభకు కూడా రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.

    • లారీలను అడ్డం పెట్టించి ట్రాఫిక్‌ జాం చేయించారు.

  • Apr 27, 2025 19:36 IST

    నెత్తిన శని పెట్టుకున్నట్లయింది: కేసీఆర్‌

    • ప్రతి ఇంటికి నల్లా ఇస్తామని దమ్ముంది కాబట్టే చెప్పాం.

    • ఆ మంచినీళ్లు కూడా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు.

    • ప్రభుత్వ జాగాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటారు.

    • అలాంటి ప్రజలకు మేం పట్టాలు ఇచ్చాం.

    • కాంగ్రెస్సోళ్లు హైడ్రా.. వాళ్ల బొంద అని పెట్టారు.

    • పేదల ఇళ్లు తొలగిస్తున్నారు.

    • ఏడాదైనా టైమ్‌ ఇవ్వాలని ఇప్పటి వరకు నోరు తెరవలేదు.

    • చేస్తారులే చూద్దామని ఊరుకున్నా.

    • ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాల్సిన సమయం వచ్చింది

  • Apr 27, 2025 19:34 IST

    కడుపుకట్టుకుని తెలంగాణ ఆదాయం పెంచాం: కేసీఆర్‌

    • నా మనసు బాధవుతోంది.. కడుపు కాలుతోంది.

    • నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం బాధగా ఉంది.

    • భూముల ధరలు పడిపోయాయి.

    • అమ్మేవాడు లేడు.. కొనేవాడు లేడు.

    • కేసీఆర్‌ దిగిపోగానే ఆగం చేశారు.

  • Apr 27, 2025 19:34 IST

    కల్యాణలక్ష్మి రూ.లక్ష సహా తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా?: కేసీఆర్

    • సిగ్గు లేకుండా ప్రజలకు బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చారు.

    • తెలంగాణలోని అన్ని దేవుళ్లపై ఒట్టు వేశారు.. ఏమైనా చేశారా?

    • మహిళలకు ఉచిత బస్సు.. జుట్లు పట్లుకుని కొట్టుకునేందుకు పనికొచ్చింది

    • BRSపై అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతూ.. చేయాల్సిన పనులు చేయట్లేదు

    • కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు బోల్తా పడ్డారు.

    • తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ దగా చేసింది.

    • మంచిగా ఉన్న తెలంగాణను ఆగం చేశారు.

    • అబద్ధపు హామీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు.

    • తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.

    • వివేకం, అజ్ఞానంతో పరిపాలన చేయలేకపోతున్నారు.

  • Apr 27, 2025 19:25 IST

    దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?: కేసీఆర్‌

    • విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?

    • విద్యార్థులకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు ఇస్తామన్నారు.. ఇచ్చారా?

    • ప్రతి పంటకు బోనస్‌ ఇస్తామన్నారు.. ఇచ్చారా?

    • 420 అబద్ధపు హామీలు ఇచ్చారు.

  • Apr 27, 2025 19:22 IST

    కాంగ్రెస్‌ వచ్చి ఏడాదైంది.. మాయరోగం వచ్చినట్లయింది: కేసీఆర్‌

    • గోల్‌మాల్‌ చేయడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేడు.

    • అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేడు.

    • ఉన్న గాంధీలు.. లేని గాంధీలు.. డూప్లికేటు గాంధీలు వచ్చి హామీలు ఇచ్చారు

    • పెన్షన్లు ఇద్దరికి ఇస్తామని హామీ ఇచ్చి ఏం చేశారు?

  • Apr 27, 2025 19:22 IST

    articleText

  • Apr 27, 2025 19:20 IST

    ఎవరు అడగకపోయినా తెలంగాణ చెరువుల్లో చేపలు పెంచాం: కేసీఆర్‌

    • లక్షలాది గొర్రెలు పంపిణీ చేశాం.

    • పారిశ్రామిక అభివృద్ధి ఎప్పుడూ లేనివిధంగా జరిగింది.

    • ఐటీ రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి.

  • Apr 27, 2025 19:19 IST

    తెలంగాణ వస్తే కరెంట్‌ రాదన్నారు: కేసీఆర్‌

    • తెలంగాణలో అద్భుతమైన ఉచిత కరెంట్‌ అందించాం.

    • అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుంటూ వచ్చాం.

    • తెలంగాణ రాకముందు రైతులను పట్టించుకునే నాథుడే లేడు.

    • ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతుల దగ్గర ధాన్యం సేకరించాం.

  • Apr 27, 2025 19:17 IST

    తెలంగాణ సాధించుకున్న తర్వాత.. రాష్ట్రాన్ని బాగు చేసేందుకు నడుం బిగించాం: కేసీఆర్

    • పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేశాం.

    • కాళేశ్వరం ప్రాజెక్టును కొత్తగా కట్టుకున్నాం.

    • మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ చేపట్టాం.

    • రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నాం.

    • దేశంలోనే ఎక్కడా లేని రైతుబంధు అమలు చేశాం.

  • Apr 27, 2025 19:16 IST

    తెలంగాణకు నెంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌: కేసీఆర్‌

    • చంద్రబాబు ఆనాడు తెలంగాణ పదం ఎత్తకుండా చేశారు.

    • ఆనాడు కాంగ్రెస్‌ వాళ్లు పదవులు కోసం నాటకాలాడారు.

    • తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశాం.

    • తెలంగాణ ఇవ్వకుండా 14 ఏళ్లపాటు వేధించారు.

    • కాంగ్రెస్‌ మెడలు వంచేందుకు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశా.

    • రాష్ట్రంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేశాం.

    • దేశంలో ఉన్న అనేక పార్టీలను కూడగట్టాం.

    • కాంగ్రెస్‌ పార్టీ గొంతు పట్టుకున్నాం.

    • విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ దిగివచ్చి తెలంగాణ ప్రకటించింది.

  • Apr 27, 2025 19:08 IST

    వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న నా భూమికి.. విముక్తి కలిగించాలని భావించా: కేసీఆర్‌

    • 1969లో మూగబోయిన ఉద్యమానికి ఊపిరి పోసింది BRS.

    • పార్టీ ఆవిర్భావం తెలంగాణ భవిష్యత్‌నే మార్చేసింది.

    • ఉద్యమం నుంచి వెనక్కి మళ్లితే.. నన్ను రాళ్లతో కొట్టిచంపండి అని ఆనాడు చెప్పా.

    • ఎత్తిన జెండా ప్రాణం పోయినా దించకూడదని నిర్ణయం తీసుకున్నా.

  • Apr 27, 2025 19:04 IST

    పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు BRS రజతోత్సవ సభ నివాళులు

    • కశ్మీర్‌లో ముష్కరులు మనదేశ ప్రజలపై దాడి చేశారు: కేసీఆర్‌

    • ఉగ్రవాదుల దాడిలో అమాయకులు చనిపోయారు.

    • కన్నతల్లి, జన్మభూమిని మించి వేరేమీ లేదు.

    • అందుకే ఆరోజు తెలంగాణ కోసం ఒక్కడిగా బయల్దేరా.

    • ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు భరించాం.

  • Apr 27, 2025 17:54 IST

    వరంగల్ : ఎల్కతుర్తి సభ సమీపంలో లో మజ్జిగ ప్యాకెట్ల బ్యాగ్‌ల కోసం ఎగబడ్డ జనం

    • వ్యాన్ నుండి మజ్జిగ ప్యాకెట్ల బస్తాలని లాక్కెళ్లిన వైనం

    • జనం ఎగబడటం తో చేతుల్లేస్తిన నిర్వాహకులు

  • Apr 27, 2025 17:48 IST

    ఎల్కతుర్తి: బీఆర్ఎస్ రజతోత్సవ సభ

    • సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాప్టర్

    • ఇప్పటికే సభ వేదికపైకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ నేతలు

    • సభకు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ప్రజానీకం

  • Apr 27, 2025 17:45 IST

    వరంగల్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ట్రాఫిక్ ఇక్కట్లు

    • హనుమకొండ దేవన్నపేట టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం

    • వరంగల్ - ఎల్కతుర్తి మధ్య ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

    • మధ్యలో ఎస్పారెస్పీ కెనాల్ వంతెనలు, రైల్వే ఆర్వోబీ దగ్గర ట్రాఫిక్ జామ్

    • కార్లు వదలి బైక్ మీద సభకు చేరుకుంటున్న నేతలు

    • కారు మధ్యలోనే వదిలి బైక్ పై సభకు వెళ్లిన హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ బాస్కర్

    • ఇక్కట్లు పడుతున్న కార్యకర్తలు

  • Apr 27, 2025 17:43 IST

    ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి ఎల్కతుర్తికి బయల్దేరిన కేసీఆర్‌

    • కాసేపట్లో ఎల్కతుర్తి బహిరంగ సభ హెలిప్యాడ్‌కు కేసీఆర్‌

    • సా.6.15 నుంచి 6.45 వరకు BRS ముఖ్య నేతలతో భేటీకానున్న కేసీఆర్‌

    • రాత్రి 7 గంటలకు రజతోత్సవ సభలో కేసీఆర్‌ ప్రసంగం

  • Apr 27, 2025 17:08 IST

    హన్మకొండ: కాసేపట్లో ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ

    • రజతోత్సవ సభకు భారీగా తరలివస్తున్న BRS శ్రేణులు

    • వరంగల్‌-ఎల్కతుర్తి మధ్య 4 కి.మీ. మేర స్తంభించిన ట్రాఫిక్‌

  • Apr 27, 2025 16:50 IST

    హనుమకొండ : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ట్రాఫిక్ ఇక్కట్లు

    • ముందే హెచ్చరించిన ఏబీఎన్

    • ఎల్లాపూర్ ఆర్వోబీ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం

    • నాలుగు కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు

    • సభా ప్రారంభమైనా మూడొంతుల ప్రాంగణం ఖాళీగానే దర్శనం

  • Apr 27, 2025 16:09 IST

    కరీంనగర్‌: హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర ట్రాఫిక్‌ జామ్‌

    • BRS రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో రద్దీ

    • హుజూరాబాద్‌ మీదుగా ఎల్కతుర్తి BRS రజతోత్సవ సభకు..

    • నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల BRS శ్రేణులు

  • Apr 27, 2025 16:01 IST

    హనుమకొండ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న మాజీ మంత్రి..

    • ఎల్కతుర్తి సభకు వస్తుండగా ట్రాఫిక్ లో చిక్కుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

    • పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయటం తో బయటకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి

  • Apr 27, 2025 15:41 IST

    యాదాద్రి : హైదరాబాద్- వరంగల్ హైవే పై వాహనాల సందడి

    • బీబీనగర్ గూడూరు టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు.

    • కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్.

    • వరంగల్ బిఆర్ఎస్ సభకు భారీగా తరలి వెళ్తున్న వాహనాలు.

  • Apr 27, 2025 15:23 IST

    హనుమకొండ : తేనెటీగల దాడి..

    • ఎల్కతుర్తి వనవిహార్ వద్ద బీఆర్ఎస్ సభకు వచ్చే కార్యకర్తలపై తేనెటీగల దాడి.

    • పరుగులు తీసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.

    • 30 మంది కి గాయాలు.

  • Apr 27, 2025 14:03 IST

    నిర్మల్ జిల్లా: బీఆర్ఎస్ బహిరంగ సభకు 50బస్సుల్లో బయలుదేరిన కార్యకర్తలు.

  • Apr 27, 2025 13:38 IST

    బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఏర్పాటై 24 వసంతాలు పూర్తై.. 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఆదివారం జరుగుతున్న ఈ సభకు గులాబీ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. రాష్ట్రంలోని నలు మూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా సభకు తరలి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..