Home » Japan
ఎల్‌డీపీలోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెల రోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు.
జపాన్‌లో తాజాగా వింత స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రొనాట్ అని చెప్పుకుని వృద్ధురాలిని నమ్మించిన ఓ నేరగాడు ఆమె కష్టార్జితాన్ని దోచుకున్నాడు. అంతరిక్షంలో చిక్కుకుపోయానని చెప్పి ఆమె నుంచి ఏకంగా రూ.6 లక్షలను రాబట్టుకున్నాడు.
జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బుల్లెట్ రైలులో ప్రయాణించారు. సెండాయ్ నగరానికి టోక్యో నుంచి జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బయలు వెళ్లారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో బుల్లెట్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానుంది. మరి ఈ బుల్లెట్ రైలు ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జపాన్-భారత్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన జపాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వార్షిక సమావేశంలో జపాన్ ప్రధానితో కలిసి పాల్గొంటారు. సెమీ కండక్టర్, బుల్లెట్ రైళ్ల తయారీ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.
వయసు జస్ట్ నెంబర్ మాత్రమే నిరూపించాడు జపాన్‌కు చెందిన కోకిచి అకుజావా తాత. 102 ఏళ్ల వయసులోనూ ఊహకు అందని రీతిలో అరుదైన ఫీట్ సాధించాడు. జపాన్‌లో అత్యంత ఎత్తైన ఫుజీ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
ఆగస్టు 29 నుండి వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ జపాన్, చైనాలను సందర్శిస్తారు. ఇరు దేశాల ఆహ్వానాల మేరకు ప్రధాని జపాన్, చైనాల్లో పర్యటించి..
జపాన్‌లో ఓ బుల్లెట్ రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు ట్రెయిన్ కండక్టర్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా వారి టిక్కెట్ డబ్బులను కూడా వాపస్ ఇచ్చారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్‌ను కూడా ఈ ఉదంతం ఆకట్టుకుంది.
రష్యాలో ఉదయం సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది. జపాన్, అమెరికా సహా పలు తీరప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.
రష్యాలో సంభవించిన భారీ భూకంపం జపాన్ సహా పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్న అనేక తీర దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికా, జపాన్ వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.