Special Love Story : ప్రేమకు వయసుతో పని లేదా? ఇది.. విస్తుపోయే వింత కథ..
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:58 PM
ఇదో వింతైన ప్రేమ కథ. కుర్రాడి వయస్సు 33 ఏళ్లు. దేశం జపాన్. పేరు ఇసము టోమియోకా. ప్రియురాలి వయసు 54 ఏళ్లు. పేరు మిడోరి. ప్రియురాలిపై తనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికి ఆమె తల్లిదండ్రులకు రూ. రెండున్నర కోట్ల విలువైన..
ఇంటర్నెట్ డెస్క్ : ఇదో వింతైన ప్రేమ కథ. కుర్రాడి వయస్సు 33 ఏళ్లు. దేశం జపాన్. పేరు ఇసము టోమియోకా. ప్రియురాలి వయసు 54 ఏళ్లు. పేరు మిడోరి. ప్రియురాలిపై తనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికి ఆమె తల్లిదండ్రులకు రూ. రెండున్నర కోట్ల విలువైన ఇంటిని కొని బహుమానంగా అందించాడు. ఈ ప్రేమ కథను హిందూస్థాన్ టైమ్స్ 'మిల్లెన్నియల్ మ్యాన్ బాయ్స్ $272,000 హోమ్ టు ఇంప్రెస్ పేరెంట్స్ ఆఫ్ హిజ్ 54-యియర్-ఓల్డ్ పార్ట్‌నర్' అనే పేరిట రాసిన ఒక ఆర్టికల్‌లో వివరించింది. ప్రేమ.. వ్యక్తుల మధ్య సామాజిక, వయస్సు వ్యత్యాసాలు కాదని, ఎంత దూరం వెళ్తుందో చూపిస్తుంది.
ఇక ప్రేమ పూర్వత్రాల్లోకి వెళ్తే.. టోమియోకా, మిడోరిని జూనియర్ స్కూల్‌లో పేరెంట్-టీచర్ మీటింగ్‌లో కలిశాడు. ఏళ్లు గడుస్తున్న క్రమంలో వారిరువురి మార్గాలు మళ్లీ కలిశాయి. అప్పటికి అతని వయసు 21 ఏళ్లు. వయస్సులో పెద్ద వ్యత్యాసమున్నప్పటికీ, ఇది ఒక లోతైన సంబంధానికి దారితీసింది. అయితే, మిడోరి తల్లిదండ్రులు మొదట వీరి ప్రేమపై సందేహాలు వ్యక్తం చేశారు. ఒక పక్క మిడోరి వయస్సు, ఆమెకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఈ సంబంధం న్యాయం కాదని భావించారు.
అయినప్పటికీ, టోమియోకా తన గట్టి నిర్ణయాన్ని నిరూపించడానికి ఒక ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతని ఆర్థిక స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా, ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకునే అతని గంభీరమైన ఉద్దేశాన్ని కూడా సూచిస్తుంది. టోమియోకా చేసిన ఈ పెద్ద పెట్టుబడి ఒక ఆర్థిక లావాదేవీ కాదు, ప్రేమ, గట్టి నిర్ణయం తాలూకూ ఒక లోతైన వ్యక్తీకరణ. ఈ లవ్ స్టోరీ జపాన్ లో ఒక ట్రెండింగ్ న్యూస్ అయి కూర్చుంది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News