Share News

Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారాలు

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:33 PM

ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్‌ శాస్త్రవేత్త ఉన్నారు.

Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారాలు
Nobel Prize 2025

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్‌ శాస్త్రవేత్త ఉన్నారు. మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకగుచీ లను ఈసారి నోబెల్ బహుమతి వరించింది. రోగ నిరోధక వ్యవస్థపై వీరు చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారాలు దక్కాయి.

Noble-2.jpg


ఈ ముగ్గురు ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’ విధానంపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా.. రెగ్యులేటరీ టీ సెల్స్‌ (ప్రత్యేక రోగనిరోధక కణాలు) ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే గార్డ్స్‌గా ఎలా పని చేస్తాయనేది వివరించారు. రోగ నిరోధక వ్యవస్థ కాపలదారుగా వ్యవహరించే టీ-సెల్స్‌లో కొన్ని అతిగా ప్రవర్తించకుండా నియంత్రిస్తున్నట్లు వీరు గుర్తించారు. వాస్తవానికి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు కూడా నియంత్రణ ఉండాలి. లేదంటే.. సొంత అవయవాలపైనే దాడి చేసే అవకాశం ఉంది. అయితే రెగ్యులేటరీ టీ సెల్స్‌ రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుందని వీరి ఆవిష్కరణలో వివరించారు.

ఈ అంశంపై నోబెల్ కమిటీ చైర్మన్ ఓలె కాంపే మాట్లాడుతూ.. రోగనిరోధక కణాలు సొంత శరీరంపైనే దాడి చేయకుండా ఉండేందుకు వీటిని గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ ఎలా పని చేస్తుంది.. అందరికీ ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎందుకు రావు.. ఇలాంటి వాటిని అర్థం చేసుకునేందుకు వీరి ఆవిష్కరణలు దోహదడుతాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 06:05 PM