Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్ మళ్లీ ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం, కుల్గాం జిల్లా మరోసారి పేలుళ్ల శబ్దాలతో నిండిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
కశ్మీర్ పండిట్లు భక్తిశ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని, జీలం నదిలో గణేశ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయిందని కార్యకర్త సంజయ్ టికూ తెలిపారు.
ఓ వ్యక్తి లేగ దూడను నడుముకు కట్టుకుని ఉన్నాడు. తను, లేగ దూడ వర్షంలో తడవకుండా ఉండేలా ఓ ప్లాస్టిక్ కవర్‌ను అడ్డుగా పెట్టుకున్నాడు. ఆ లేగ దూడ ఎంతో ముద్దుగా కవర్ కింద నుంచి చుట్టూ చూస్తూ ఉంది.
సమందర్ చాచాగా కూడా పాపులర్ అయిన బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎలాంటి క్లిష్ట మార్గాలలోనైనా ఉగ్రమూకలను భారత్‌లోకి చొరబడేలా ఇతను సహాయం చేసేవాడు.
గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంలో అనేక క్లౌడ్ బరస్టులు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. నిన్న(శుక్రవారం) కూడా బండిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్‌లో మరో క్లౌడ్ బరస్ట్ జరగినట్లు అధికారులు తెలిపారు.
భారతావనిపై మేఘ విస్ఫోటం జరిగిందా.. అన్నట్లు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, జలాశయాలు ఉ ప్పొంగి ప్రవహిస్తుండడంతో..
భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను భారత్ ఆర్మీ మట్టుపెట్టింది. ఉగ్రవాదులు దాగి ఉండొచ్చనే అనుమానంతో ప్రస్తుతం భద్రతా దళాలు బందిపొరా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భారత వాతావరణ శాఖ జమ్మూకశ్మీర్‌లోని పలు ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో మరిన్ని చోట్ల కొండచరియలు విరిగిపడొచ్చని, మెరుపువరదలు సంభవించవచ్చని అప్రమత్తం చేసింది.