Home » Jagtial
జిల్లాలో తొలి విడతలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి గురువారం ఉదయం అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా, సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబరు 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
బకాయిల భారం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన రెండేళ్ల బకాయిలను విడుదల చేయకపోవడంతో స్కూల్ యాజమాన్యాలు ఇక పాఠశాలలను నడుపలేమంటూ చేతులెత్తేశాయి.
స్థానిక సంస్థల షెడ్యూల్ జారీ కావడంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికార యంత్రాంగం నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధుమిత్రులపై నిఘా ఉంచింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీలకు దక్కనున్నది. ఈ స్థానాన్ని బీసీ జనరల్ స్థానంగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బీసీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులు ఎవరైనా ఈ స్థానానికి పోటీపడే అవకాశముంటుంది. గతంలో ఈ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది.
జిల్లాలోని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మూడు రోజులుగా రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న అధికారులు ఎట్టకేలకు శనివారం ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. జడ్పీ చైర్మన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు.
వీధి వ్యాపారుల సంక్షేమం కోసం లోక్ కల్యాణ్ మేళా పేరుతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వీధి వ్యాపారుల సంక్షేమం, అభివృద్ధి, తదితర కార్యక్రమాల కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
peddapalli ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపుతోపాటు భవిష్యత్‌లో ప్రవేశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వలే జూనియర్ కళాశాలల్లోనూ ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తీసుక వచ్చింది.
మంథని నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించడంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు 22 ఇండ్లు కూడా పూర్తి చేయించ లేకపోయారని విమర్శించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వాహనాల రద్దీరోజురోజుకు పెరుగుతోంది. నగరం స్మార్ట్‌సిటీ కావడమేకాకుండా శివారులోని పద్మనగర్, చింతకుంట, మల్కాపూర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, గోపాల్‌పూర్, దుర్శేడ్, బొమ్మకల్, సదాశివపల్లి, అల్గునూర్‌తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీ నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి.
సాధారణ పేపర్లపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు లభించనున్నాయి. భూ భారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించేందుకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా భూములపై హక్కులు దక్కనున్నాయి.