Share News

పెరిగిన సైబర్‌ క్రైం

ABN , Publish Date - Dec 28 , 2025 | 01:03 AM

ఈ ఏడాది కాలంలో సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు గత ఏడాదికంటే అధికంగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు గత ఏడాదితో పోల్చిచూస్తే ఇంకా అదుపులోకి రాలేదు. కిడ్నాప్‌లు, అత్యాచారాలు, చీటింగ్‌ కేసులు మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయి.

పెరిగిన సైబర్‌ క్రైం

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది కాలంలో సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు గత ఏడాదికంటే అధికంగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు గత ఏడాదితో పోల్చిచూస్తే ఇంకా అదుపులోకి రాలేదు. కిడ్నాప్‌లు, అత్యాచారాలు, చీటింగ్‌ కేసులు మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. కమిషనరేట్‌ వ్యాప్తంగా వివిధ రకాల కేసులకు సంబంధించి నేరస్థులకు శిక్షలు వేయించటంలో కమిషనరేట్‌ పోలీసులు సఫలీకృతమయ్యారు. పకడ్భందీ సాక్ష్యాలను ప్రవేశపెట్టిన పోలీసులు 53 మంది నిందితులకు జైలుశిక్షలు పడేలా చర్యలు తీసుకోగా ఇందులో 5గురు నిందితులకు జీవితఖైదు శిక్ష పడింది. మహిళలు, యువతులు, విద్యార్థినిలను వేధిస్తున్న పోకిరీలలపై షీటీం పోలీసులు కొరఢాఝులిపించి 70 కేసులు నమోదు చేశారు. అయితే రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు ఇంకా అదుపులోకి రాకపోవటం ఆందోళనకరమైన విషయం. ఈ మేరకు పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం శనివారం కమిషనరేట్‌ వార్షిక నివేదికను మీడియా సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్‌ పోలీస్‌కమిషనరేట్‌లో 2025 సంవత్సరంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి 5,126 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం 6,164 కేసులు నమోదయ్యాయి. డయల్‌ 100 ద్వారా 49,342 ఫిర్యాదులురాగా అన్నింటికీ బ్లూకోల్ట్స్‌ పోలీసులు సరాసరి 7నిమిషాల 11 సెకనలలో స్పందించారు. ఆపరేషన స్మైల్‌ అండ్‌ ఆపరేషన ముస్కానద్వారా టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేసి 2025లో 141 మంది బాలబాలికలను గుర్తించి సంరక్షకులకు అప్పగించారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సైబర్‌ మోసాలపై 2,437 ఫిర్యాదులురాగా 280 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 352 కేసుల్లో 1 కోటి 10 లక్షల 9 వేల 444 రూపాయలు కోర్టు ద్వారా బాధితులకు అందజేశారు. గత ఏడాది 208 కేసులే నమోదయ్యాయి. ఈ సంవత్సరం 72 ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదు కావటంతో పాటు ఫిర్యాదులు కూడా అధికంగానే ఉన్నాయి.

కుటుంబ సభ్యులే హంతకులు

ఫ చెవుల్లో గడ్డి మందు పోసి భార్య హత్య చేసిన ఘటన కరీంనగర్‌లో జూలై 29న జరిగింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత (45)జూలై 29న బొమ్మకల్‌ శివారులోని రైల్వేట్రాక్‌ పక్కన అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. పోలీసుల విచారణలో సంపతను హత్య చేసినట్లు వెల్లడైంది.

ఫ ప్రియునితో వివాహేతర సంబంధంతో పాటు, భర్త డబ్బుల కోసం వేధిస్తున్నాడనే కారణంగా సెప్టెంబరు 17వ తేదీన కరీంనగర్‌ పట్టణానికి చెందిన కత్తి సురేష్‌(36)కు ఇంటి వద్ద రాత్రి అతని భార్య మద్యంలో బీపీ, నిద్రమాత్రలు కలిపి తాగించి, అపస్మారకస్థితిలోకి వెళ్లిన తరువాత మెడకు చీరతో ఉరివేసి హత్య చేసింది.

ఫ గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన కత్తి శివ గ్రామంలోని వృద్ధ దంపతులు గజ్జల శంకరయ్య(76), అతని భార్య గజ్జల లక్ష్మి(70)లకు అక్టోబరు 7న ఇద్దరు వృద్ధులకు మత్తు గోళీలు(కల్లులో మత్తుకోసం ఉపయోగించే) మింగించాడు. వృద్ధులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా నిందితుడు శివ లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శంకరయ్య అక్టోబరు 8న మధ్యాహ్నం మృతి చెందాడు.

ఫ లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన అనవేణి మల్లేశం 15 ఏళ్లుగా కరీంనగర్‌లో హమాలీ పనిచేసుకుంటూ భార్య, దివ్యాం గులైన కూతురు, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. పిల్లలు దివ్యాంగులు కావడంతో వారి పరిస్థితి ఎప్పటికీ మారదని మానసి క ఆందోళనతో నవంబరు 15న కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో దివ్యాంగులైన కూతురు హర్షిత(17), కొడుకు హర్షిత(15)లకు టవల్‌ తో ఉరి బిగింగి హత్యాయత్నం చేశాడు. కూతురు మృతిచెందింది. కొడుకు ఆసుపత్రిలో చిక్సిపొందుతూ కోలుకున్నాడు.

ఫ పశువులు, పందులు, గొర్రెలు, విద్యుత మోటార్లు, కాపర్‌ వైర్‌ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగలను కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు నవంబరు 15న అరెస్టు చేసి, 20 లక్షల సొత్తును రికవరీ చేశారు.

ఫ ఏడు రోజుల శిశువును మధ్య దళారులతో కలిసి 5 లక్షల రూపాయలకు విక్రయించిన కేసులో నవంబరు 22న కరీంనగర్‌లో వైజాగ్‌కు చెందిన తల్లి(22)తోపాటు 16 మంది దళారులు, సహకరించినవారిని టూటౌన పోలీసులు అరెస్టు చేశారు.

ఫ అప్పుల బాధతో కరీంనగర్‌లో బట్టలషాపు మహాలక్ష్మి ఫ్యాషనమాల్‌ యజమాని సంగం రాజేష్‌ తన షాపును తగలబెట్టి ప్రమాదంగా చత్రీకరించే యత్నం చేశాడు. పోలీసులు విచా రణలో నిజం బయటకురావటంతో నిందితుడిని నవంబరు 20న త్రీటౌన పోలీసులు అరెస్టు చేశారు.

ఫ కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్‌(40)తో భూ వివాదం కారణంగా ఏడాదిన్నర కిందట అదే గ్రామానికి చెందిన దేవునూరి సతీష్‌, శ్రావణ్‌లు పథకం ప్రకారం గొంతుకు ఉరిబిగించి హత్య చేసి గంగాధర మండలం నూకపల్లి వద్ద కెనాల్‌లో పడేశారు. నిందితులను నవంబరు 21న పోలీసులు అరెస్టు చేశారు.

ఫ నవంబర్‌ 29న ఇన్సూరెన్స డబ్బుల కోసం స్వంత అన్నను అతని తమ్ముడే టిప్పర్‌ ఎక్కించి హత్య చేశాడు. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేష్‌ తన సోదరుడు మామిడి వెంకటేష్‌(37)పేరిట 4.14 కోట్ల రూపాయల విలువ కలిగిన 9 బీమా పాలసీలు చేయించి టిప్పర్‌తో ఢీకొట్టి హత్య చేయించాడు.

ఫ రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో డిసెంబరు 2న తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రి, భార్య కలిసి సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించారు. అంజయ్య భార్య శిరీషతో తన మామ గాదె లచ్చయ్య(63) వివాహేతర సంబంధం పెట్టుకు న్నాడు. పథకం ప్రకారం గాదె అంజయ్యను హత్య చేయించారు.

ఫమైనర్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు కరీంనగర్‌కు చెందిన నర్సింహాచారికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కరీంనగర్‌ కోర్టు డిసెంబర్‌ 5న తీర్పు వెలువరించింది.

మరికొన్ని నేరాలు...

జనవరి 3న దన్గర్‌వాడీ ప్రభుత్వ పాఠశాలలో కోతుల భయంతో ఒక విద్యార్థి మొదటి అంతస్థుపై నుంచి దూకటంతో రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాలయ్యాయి. జనవరి 13న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు, అరెస్టు, 14న కోర్టుకు తరలించారు. 28న గంగాధర తల్లీ, కొడుకుల కిడ్నాప్‌ అయ్యారు. ఫిబ్రవరి 2న బొమ్మకల్‌లో బెజ్జంకి మహేష్‌ను బీరుసీసాతొ గొంతుకోసి హత్య చేశారు. 5న మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కేసులో నలుగురు నిందితల అరెస్టు , జ్యోతినగర్‌లో 183 గ్రాముల గంజాయి పట్టివేత, 11న చొప్పదండి ఎమ్మెల్యేను బెదిరించిన నిందితుడి అరెస్టు, 12న సాయినగర్‌లో 98 గ్రాముల బంగారం చోరీ, 13న బైక్‌ దొంగల అరెస్టు 17న తప్పుడు పత్రాలతో తండ్రి ఆస్థిని కాజేసిన కొడుకు అరెస్టు మార్చి నలుగురు బాలికల అదృశ్యం, గుంటూర్‌లో ప్రత్యక్షం. కిలోన్నర గంజాయి చాక్లెట్స్‌ పట్టివేత, ఇద్దరి అరెస్టు. 16న నుస్తులాపూర్‌కు చెందిన తనుకు వెంకటమ్మ (70) మనుమడి చేతిలో హత్య జరిగింది. ఏప్రిల్‌ 9న ట్రాక్టర్‌తో సహా చిన్నారి బావిలోపడి దుర్మరణం. మే 1న మానేరువాగులో రీల్స్‌ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అర్బాజ్‌(20) దుర్మరణం. 13న అగోరి శ్రీనివాస్‌పై అత్యాచారం కేసు నమోదు. 16న వలపు వలతో రప్పించి దోపిడీ, చిత్రహింసలు. జూన 13న గుప్త నిధుల పేరిట 13 లక్షల స్వాహా. 17న ఏసీబీకి పట్టుబడిన పంచాయతీరాజ్‌ ఏఈ శరత, సీనియర్‌ అసిస్టెంట్‌ వేణుగోపాల్‌రావు . జూలై 7న మసాజ్‌ పేరిట ఒక వ్యక్తిని రప్పించుకుని దోపిడీ. ఆగస్టు 4న దొంగ అరెస్టు, 18 తులాల బంగారం, 164 తులాల వెండి, లక్ష నగదు స్వాధీనం , 11న సింగపూర్‌ నుంచి కొడుకు పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన తండ్రి గుండెపోటుతో మృతి 19న వడ్డీవ్యాపారుల వేధింపులతో కృష్ణనగర్‌లో ఉరివేసుకుని తంగల్ల శ్రీనివాస్‌(44) ఆత్మహత్య, సెప్టెంబరు 22న ఉమ్మడి జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యులు కడారి సత్యనరాయణరెడ్డి, కట్టా రాంచంద్రారెడ్డిలు ఎనకౌంటర్‌లో హతం. డిసెంబరు 20న మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్టయ్యారు.

2025లో నేరాల నియంత్రణ

- సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2025 సంవత్సరానికి నేరాల నియంత్రణలో అద్భుతమైన ఫలితాలు సాధించామని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తెలిపారు. మొత్తం నేరాల్లో 16.84 శాతం తగ్గుదల ఉందని, మహిళలపై నేరాలు 5.18 శాతం తగ్గిందన్నారు. సైబర్‌ నేరగాళ్ల నుంచి 1.10 కోట్ల రికవరీ చేశామన్నారు. ఆర్థిక నేరాల రికవరీలో 24 శాతం వృద్ధి సాధించి నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రశాంతంగా ఎన్నికలు, పండుగల నిర్వహించా మన్నారు. మానవ అక్రమరవాణా నియంత్రణలో భాగంగా 9 మంది బాధితులను రక్షించినట్లు సీపీ తెలిపారు. ట్రాఫి క్‌ నిబంధనల ఉల్లంఘనపై 3.83 లక్షల ఈ-చలాన్లు నమోదు చేసి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు వెంక టరమణ, భీంరావు ఏసీపీలు వెంకటస్వామి, విజయకు మార్‌, రిజర్వు ఇనస్పెక్టర్‌ కిరణ్‌ కుమార్‌లతో పాటు పలువు రు అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 01:03 AM