పది మెమోలో తప్పులకు చెక్
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:30 AM
పదో తరగతి మెమోల్లో తప్పులను అదిగమించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదువుకు ప్రధాన ఆధారం వయో నిర్ధారణ...సబ్జెక్ట్ జ్ఞానం వంటి అంశాల కోసం అవసరమైన పాఠశాల రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా టెన్త మోమోలు, సర్టిఫికెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి, తల్లిదండ్రులు, ఇంటిపేరు వంటి వివరాల్లో తప్పులు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
జగిత్యాల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి మెమోల్లో తప్పులను అదిగమించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదువుకు ప్రధాన ఆధారం వయో నిర్ధారణ...సబ్జెక్ట్ జ్ఞానం వంటి అంశాల కోసం అవసరమైన పాఠశాల రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా టెన్త మోమోలు, సర్టిఫికెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి, తల్లిదండ్రులు, ఇంటిపేరు వంటి వివరాల్లో తప్పులు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థి ఉన్నత విద్య, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పుల్లేని రికార్డులు అవసరమవుతాయి. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల వివరాలు సరిచూడడంలో నిర్ళక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పాఠశాలల్లో చదువుతున్న సమయంలోనే తప్పులు గుర్తించి సరిచేస్తే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.
- తప్పులు లేకుండా ముందస్తు చర్యలు...
వచ్చే ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో తప్పులు లేని మెమో కోసం విద్యాశాఖ నామినల్ రోల్ (ఎనఆర్) విధానం ద్వారా కసరత్తు చేస్తోంది. ప్రతీ విద్యార్థి, తండ్రి, తల్లి పేరు, ఇంటి పేరు, జనన తేదీ, సముదాయ కోడ్ విద్యా కార్యక్రమం (సాధారణ-ఒకేషనల్) వంటి వివరాలు సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల ఫొటోలు, సంతకాలు కూడా నామినల్ రోల్‌లో సరిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఆనలైన ద్వారా విద్యార్థుల డేటా జమ చేసిన తరువాత, హెచఎం చేత అందుబాటులో ఉన్న ప్రింట్ లిస్ట్‌ను డౌనలోడ్ చేసుకొని తప్పుల కోసం ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. విద్యార్థి వివరాల్లో తప్పులు ఉంటే, పరీక్ష హాల్‌టికెట్, ఫలితాలు, తదుపరి విద్యార్థి స్థాయిలో ఉపయోగించే సర్టిఫికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థి డేటాను అప్‌లోడ్ చేసే సమయంలో అదే స్కూల్ కోడ్, పాస్‌వార్డ్ ద్వారా ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి నామినల్ రోల్‌లో తప్పులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం ద్వారా, భవిష్యత్తులో విద్యా సంబంధిత ప్రక్రియల్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
- 125 రూపాయలతో...
కొన్ని రోజులుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నామినల్ రోల్ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపుగా సగానికి పైగా నామినల్ రోల్ ప్రక్రియ పూర్తయిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. టెన్త మెమోలో తప్పులను సరిచేసుకు నేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉంది. 125 రూపాయలతో సం బంధిత పాఠశాల హెచఎం విద్యార్థికి సంబంధించి తప్పులను సరిచేసేందుకు చలాన తీయాల్సి ఉంటుంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు ముందు, హాల్ టికెట్ వచ్చేసరికే ఎలాంటి తప్పులు ఉన్నా సరిదిద్దాల్సి ఉంటుంది. ఈఅవకాశా న్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు..
చిన్న సమస్య...పెద్ద కష్టాలు...
పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి వివరాలను ధ్రువీకరించి సరిచూడకపోవడం వల్ల పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రత్యేకంగా పాఠశాల స్థాయిలోనే విద్యార్థి పేరు, తండ్రిపేరు, జనన తేదీ, కులం సబ్జెక్టు వివరాల్లో తప్పులు ఉంటే పై తరగతులకు చేరిన తరువాత వాటిని సరిచేయ డం కష్టసాధ్యమవుతోంది. తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది సమన్వయంతో ప్రతీ విద్యార్థి వివరాలను పూర్తిగా పరిశీలించి రికార్డుల్లో సరిగ్గా నమోదు చేయడం అవసరం. ముఖ్యంగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల టెస్ట్ మెమోల్లో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధ్రువీకరించాల్సి ఉం టుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే సమయం లో చేస్తున్న చిన్నపాటి తప్పిదాలే భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుం టాయి. అందువల్ల ప్రతీ పాఠశాల విద్యార్థుల వివరాలను ముందుగానే సరి చూడాలని, అవసరమైతే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని విద్యా అధికారులు సూచిస్తున్నారు.