Home » IPL 2025
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ 81 పరుగులతో మెరుపు ప్రదర్శన కనబరచగా, సాయి సుదర్శన్ గట్టి పోరాటం చేశాడు.
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. ముల్లాన్‌పూర్‌లో పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ముంబైది పైచేయిగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్ పోరాడి ఓటమిపాలైంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి.
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముల్లాన్‌పూర్‌లో పరుగుల వరద పారించారు. ఓపెనర్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81) ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. మరికొద్ది సేపటల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది.
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమాలను అలరిస్తున్న ఐపీఎల్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇక, మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది
ముల్లాన్‌పూర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఆదివారం పంజాబ్‌తో జరగబోయే క్వాలిఫియర్-2 మ్యాచ్‌లో ఆడుతుంది. కాగా, ఈ రోజు మ్యాచ్ జరిగే ముల్లాన్‌పూర్‌లో వర్షం కురిసే ప్రమాదం ఉందట.
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. క్వాలిఫయర్‌కు అర్హత సాధించేందుకు రెండు బలమైన జట్లు పోటీపడుతున్నాయి. ముల్లాన్‌ఫూర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక పోరు జరగబోతోంది
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరిసింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలకమైన మ్యాచ్‌లో కూడా సత్తా చాటింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటున్నారు ఆర్సీబీ బౌలర్లు. ఓ రేంజ్‌లో డామినేషన్ కొనసాగిస్తోంది బెంగళూరు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆతిథ్య జట్టును వణికిస్తోంది.
టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తూ వస్తున్న పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఫైనల్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడ్డారు. దీంతో బెంగళూరు ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంచగలిగారు.