Share News

IPL 2025 MI vs GT: టాస్ గెలిచిన ముంబై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - May 30 , 2025 | 07:06 PM

ఐపీఎల్‌‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. మరికొద్ది సేపటల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది.

IPL 2025 MI vs GT: టాస్ గెలిచిన ముంబై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
Mi vs GT

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. మరికొద్ది సేపటల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని ఇరు జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి.


టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌కు రెడీ అవుతున్నారు. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనబడుతోంది. జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఇరు జట్లకు చెందిన కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ముంబై ఇండియన్స్ జట్టుకు రికెల్టన్, విల్ జాక్స్ దూరం కాబోతున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు కీలక బ్యాటర్ జాస్ బట్లర్ కూడా ఆ మ్యాచ్‌ ఆడడం లేదు.


తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో, ఛరిత్ అశలంక, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, కుషాల్ మెండిస్, రూథర్‌ఫర్డ్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, కోయేట్జ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్


ఇవి కూడా చదవండి..

చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 07:06 PM