IPL 2025 MI vs GT: రోహిత్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్..
ABN , Publish Date - May 30 , 2025 | 09:26 PM
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముల్లాన్‌పూర్‌లో పరుగుల వరద పారించారు. ఓపెనర్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81) ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరు సాధించింది.
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముల్లాన్‌పూర్‌లో పరుగుల వరద పారించారు. ఓపెనర్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81) ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరు సాధించింది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. (GT vs MI). మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. గుజరాత్ ఎదుట భారీ టార్గెట్ ఉంచింది.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ముంబై ఓపెనర్లు చెలరేగారు. గుజరాత్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా ముంబైకు కలిసొచ్చింది. రోహిత్ శర్మ (81), జానీ బెయిర్‌స్టో (47) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. బెయిర్ స్టో అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ (33) చూడచక్కని షాట్లతో అలరించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (25) కూడా మూడు సిక్స్‌లు కొట్టాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (22) కూడా వేగంగా పరుగులు చేశారు.
చివరకు ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు. మరి, ఈ భారీ స్కోరును గుజరాత్ టైటాన్స్ ఎలా ఛేదిస్తుందో చూడాలి. ఆ జట్టు కీలక బ్యాటర్ జాస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది.
ఇవి కూడా చదవండి..
చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి