Share News

IPL 2025 MI vs GT: నిష్క్రమించేదెవరు.. ముల్లాన్‌పూర్‌లో కీలక సమరం

ABN , Publish Date - May 30 , 2025 | 04:41 PM

ఐపీఎల్‌‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. క్వాలిఫయర్‌కు అర్హత సాధించేందుకు రెండు బలమైన జట్లు పోటీపడుతున్నాయి. ముల్లాన్‌ఫూర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక పోరు జరగబోతోంది

IPL 2025 MI vs GT: నిష్క్రమించేదెవరు.. ముల్లాన్‌పూర్‌లో కీలక సమరం
GT vs MI

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. క్వాలిఫయర్‌కు అర్హత సాధించేందుకు రెండు బలమైన జట్లు పోటీపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక పోరు జరగబోతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌ను వర్ష భయం వెంటాడుతోంది.

BUMRAH.jpg


టోర్నీలో బలమైన జట్లుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు గత మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాయి. పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై, లఖ్‌నవూ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలయ్యాయి. దాంతో పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటివరకు ఏడు సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ రెండు సార్లు గెలవగా, గుజరాత్ టైటాన్స్ ఐదు విజయాలు సాధించింది. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.


ఈ ఆసక్తికర మ్యాచ్ జరుగుతున్న ముల్లాన్‌పూర్‌లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే భారీ వర్షం కాకుండా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే స్థాయిలో చినుకులు పడవచ్చని పేర్కొంది. గురువారం పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మ్యాచ్ జరిగిన మైదానంలోనే ఈ మ్యాచ్ కూడా జరగబోతోంది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 101 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్‌లో కూడా టాస్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది.


ఇవి కూడా చదవండి..

చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:41 PM