Share News

IPL 2025 MI vs GT: ఎలిమినేటర్ మ్యాచ్‌కు వానగండం.. ఎవరికి లాభం..

ABN , Publish Date - May 30 , 2025 | 05:47 PM

ముల్లాన్‌పూర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఆదివారం పంజాబ్‌తో జరగబోయే క్వాలిఫియర్-2 మ్యాచ్‌లో ఆడుతుంది. కాగా, ఈ రోజు మ్యాచ్ జరిగే ముల్లాన్‌పూర్‌లో వర్షం కురిసే ప్రమాదం ఉందట.

IPL 2025 MI vs GT: ఎలిమినేటర్ మ్యాచ్‌కు వానగండం.. ఎవరికి లాభం..
Mullanpur Cricket Stadium

ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు రెడీ అవుతున్నారు. ముల్లాన్‌పూర్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ (MI vs GT) జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఆదివారం పంజాబ్‌తో జరగబోయే క్వాలిఫియర్-2 మ్యాచ్‌లో ఆడుతుంది. కాగా, ఈ రోజు మ్యాచ్ జరిగే ముల్లాన్‌పూర్‌లో వర్షం కురిసే ప్రమాదం ఉందట. మ్యాచ్ సమయంలో జల్లులు (Rain) పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.


ముల్లాన్‌పూర్‌లో జరగనున్న ఈ ఎలిమినేట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏం జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే కనీసం ఇరు జట్ల మధ్య ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించి విజేత ఎవరో తేలుస్తారు. అయితే మ్యాచ్ నిర్వహించడానికి అసలు అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఆ జట్టు క్వాలిఫియర్-2కు అర్హత సాధిస్తుంది.


లీగ్ దశలో ముంబై కంటే గుజరాత్ టైటాన్స్ ఎక్కువ విజయాలు సాధించింది. 14 మ్యాచ్‌ల్లో గుజరాత్ 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముంబై 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే గుజరాత్ తర్వాతి దశకు చేరుకుంటుంది. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. మరి, వరుణ దేవుడు ముంబై ఇండియన్స్‌ను కరుణిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి..

చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్

టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 05:47 PM