Home » International News
పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌లో మహిళా ఉద్యోగులను తప్పించిన వివాదానికి సంబంధించి హిందూ ధార్మిక సంఘం బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ..
పర్షియన్ గల్ఫ్‌లో మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, 10 వేలమంది నావికులు, నౌకాదళ సైనికులను మోహరించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
బాల్టిక్ సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటోకు రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. కలినిన్‌గ్రాడ్ ప్రాంతాన్ని రష్యా నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీసా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అవసరమైతే దానిని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
మక్కా గ్రాండ్ మసీదు ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి ప్రయత్నం జరిగిందంటూ వైరల్ అవుతున్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి బాంబర్ కాదని, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్‌కు తెరలేపాయి. ఓ యూజర్ చేసిన కామెంట్‌కు ఆయన ఇచ్చిన రిప్లైయే దీనికి కారణం. ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువగా మహిళలే పోస్టులు పెడుతున్నారని, అది ఫీమేల్ యాప్ అని జీజర్ క్యాపిటర్ అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. ఆ ఫీమేల్ యాప్‌ను డిలీట్ చేశానని ఆయన చెప్పారు. ఆయన కామెంట్‌కు మస్క్ స్పందిస్తూ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్‌తో తాము చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్ అన్నారు. రష్యాలోని మాస్కోలో వాల్దాయ్ ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రష్యా ఎక్స్‌పర్ట్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్ దగ్గర జరుగుతున్న దాడిని ఎవరో వ్యక్తి తన ఫోన్ కెమెరా నుంచి ఆ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసిన ఒమన్ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, తనకున్న సమాచారం మేరకు ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండవచ్చనే అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు.