Home » HYDRA
హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ధర్నా చేశాయి. జీతాలు తగ్గించారంటూ హైడ్రా తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టాయి.
DRF Protest: హైడ్రాకు డీఆర్‌ఎఫ్ బృందాలు మెరుపు షాక్ ఇచ్చాయి. హైడ్రా ఆఫీస్ ముందు డీఆర్‌ఎఫ్ సిబ్బంది ధర్నాకు దిగారు.
మాంగార్ బస్తీ, ముషీరాబాద్ వినోభానగర్‌లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
యాకుత్‌పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్‌పిట్ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు.
ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1070ను కేటాయించింది. ఇప్పటి వరకు ప్రజావాణి, ఎక్స్ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండగా.. తాజాగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది.
హైదరాబాద్‌లో రాబోయే 2 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..