HYDRA: రూ.30 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:06 AM
కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.
హైదరాబాద్ సిటీ: కొండాపూర్(Kondapur)లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా(HYDRA) చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది. రాఘవేంద్ర కాలనీలో పార్కుతోపాటు కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 2 వేల చదరపు గజాల స్థలాన్ని లే అవుట్‌లో చూపించారు. అయితే, ఈ స్థలం ఖాళీగా ఉండడంతో బై నంబర్లు సృష్టించి 10 ప్లాట్లుగా విభజించి షెడ్లు వేశారు.

రాఘవేంద్ర కాలనీ సీ బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. అది పార్కుతోపాటు కమ్యూనిటీ హాల్ స్థలంగా నిర్ధారించి షెడ్లు తొలగించారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పార్కు స్థలం.. హైడ్రా కాపాడిందని బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని ప్లాట్లుగా విభజించిన కబ్జాదారులు.. ఆ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు భవన నిర్మాణానికీ అనుమతులు తెచ్చుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో అనుమతులను వెనక్కి తీసుకున్న జీహెచ్‌ఎంసీ.. క్రమబద్ధీకరణను రద్దు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News