Hyderabad HYDRA Demolition: మరోసారి హైడ్రా దూకుడు.. బంజారాహిల్స్‌లో కూల్చివేతలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:12 AM
బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
హైదరాబాద్, అక్టోబర్ 10: నగరంలో హైడ్రా (HYDRA)మరోసారి దూకుడు పెంచింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా.. తాజాగా భాగ్యనగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు (శుక్రవారం) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది.
దాదాపు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు, సర్వే నెంబర్లు సృష్టించి ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా ముందుకు వచ్చి కూల్చివేతలు చేపట్టింది. ఐదు ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది హైడ్రా. ఈ ఐదు ఎకరాల స్థలంలో జలమండలికి 1.2 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితో ఓ వ్యాపారి ఆ స్థలాన్ని కబ్జా చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ స్థలంలో వేసిన షెడ్లను నేలమట్టం చేసింది. ఐదు ఎకరాల చుట్టూ కూడా ఫెంక్షన్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది హైడ్రా.
మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా హైడ్రా దూకుడు పెంచింది. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో 700 గజాల ప్రభుత్వ పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది. కాలనీలోని పార్క్ స్థలాన్ని బీఆర్‌ఎస్ నేత గతంలో కబ్జాకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి.. 700 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది.
ఇవి కూడా చదవండి...
లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్య
తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News